Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వర్షం వచ్చినా మారని ముంబై ఇండియన్స్ రాత!

కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. చివరి రెండు ఓవర్లను మినహాయిస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టును కేకేఆర్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. కేకేఆర్ బౌలింగ్ దాటికి ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 148 పరుగులుగా నమోదైంది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాకులు తగిలాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ముగిసేసరికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(6), నమన్ ధీర్(0) వికెట్లను ముంబై కోల్పోయింది. కేకేఆర్ బౌలర్ కెమరూన్ గ్రీన్ ఒకే ఓవర్లో ఈ రెండు కీలక వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(15) రెండు భారీ సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించినప్పటికీ, సౌరభ్ దూబే బౌలింగ్‌లో ఔట్ కావడంతో హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ స్వల్ప వ్యవధిలోనే ముగిసింది. పవర్‌ప్లే ముగిసేలోపే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌(15)ను కూడా కేకేఆర్ ఎడమచేతి వాటం పేసర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ముంబై తీవ్ర కష్టాల్లో పడింది.

MI vs KKR Kolkata Bowlers Restrict Mumbai Indians to 147 8 Despite Corbin Bosch Late Cameo

ముంబై ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్‌కు కాసేపు ఆటంకం కలిగింది. అయితే మ్యాచ్ తిరిగి ప్రారంభమైనా ముంబై రాత మారలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26), తిలక్ వర్మ(20) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ.. కేకేఆర్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ రన్ రేట్ పెరగకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తన కోటా ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక అద్భుతమైన బంతితో హార్దిక్ పాండ్యాను ఔట్ చేసి ముంబైని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. 18వ ఓవర్ వరకు కేకేఆర్ బౌలింగ్ క్లినికల్‌గా సాగింది.

కానీ ఇన్నింగ్స్ ఆఖర్లో కార్బిన్ బాష్ వేగంగా ఆడటంతో ముంబై జట్టు ఆ స్కోరైనా సాధించగలిగింది. కేకేఆర్ బౌలర్ కార్తీక్ త్యాగి వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ముంబై బ్యాటర్లు ఏకంగా 19 పరుగులు రాబట్టారు. ఆ ఓవర్ తొలి రెండు బంతులను కార్బిన్ బాష్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదగా.. మూడో బంతికి ఫోర్ కొట్టాడు. చివరి బంతికి దీపక్ చాహర్ (10) అనుకుల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కార్బిన్ బాష్ కేవలం 18 బంతుల్లోనే 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరాన్ గ్రీన్, కార్తీక్ త్యాగి తలో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ తీశాడు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అంత సులువుగా లేనందున, కేకేఆర్ చేయాల్సిన 148 పరుగుల రన్ చేజ్ చాలా ఆసక్తికరంగా మారనుంది.

Story first published: Wednesday, May 20, 2026, 22:41 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+