Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: ముంబై ఇండియన్స్ ఖాతా తెరవాలంటే ఇలా చేస్తే చాలు!

MI vs KKR: ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో నెమ్మదిగా ప్రారంభమయ్యే జట్టుగా పరిగణించబడుతుంది. ఈ సీజన్‌లో కూడా అలాంటిదే జరుగుతోంది. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఆ జట్టు ఇప్పుడు తన మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ ముంబై సొంత మైదానం వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు కేకేఆర్‌ను ఓడించి సీజన్‌లో తొలి విజయాన్ని సాధించాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

ఓపెనర్ల బ్యాట్ నుంచి పరుగులు అవసరం
ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ రెండు మ్యాచ్‌లలోనూ విఫలమయ్యారు. రెండు సార్లు రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ముంబై జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీ పడాలంటే ఇద్దరు ఓపెనర్లలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుంది.

MI vs KKR Here s What Mumbai Indians Need to Do to Open Their Account

ప్లేయింగ్ XI ఇంకా సెట్ కాలేదు..
ముంబై ఇండియన్స్ ప్లేయింల్ ఎలెవన్ ఇంకా సెట్ అవ్వలేదు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన విఘ్నేశ్ రెండో మ్యాచ్ ఆడలేదు. రాబిన్ మింజ్ బ్యాట్ తో రాణించడం లేదు. సత్యనారాయణ రాజు కూడా ప్రభావం చూపలేకపోయాడు.

పవర్ ప్లేలో ముంబైకి వికెట్లు కావాలి..
ముంబై ఇండియన్స్‌లో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌ వంటి ఇద్దరు ఉత్తమ పవర్ ప్లే బౌలర్లు ఉన్నారు. రెండు మ్యాచ్‌లలో జట్టు పవర్ ప్లేలో చాలా పరుగులు ఇచ్చింది. కేకేఆర్ జట్టులో విధ్వంసకర ఓపెనర్లు ఉన్నారు. ముంబై జట్టు వీలైనంత త్వరగా వారిని ఎదుర్కోవలసి ఉంటుంది.

స్ట్రైక్ రొటేట్ చేయాలి..
7 నుంచి 15 ఓవర్ల మధ్య సిక్సర్లు, ఫోర్లు కొట్టడంతో పాటు స్ట్రైక్‌ను రొటేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. దీని వల్ల బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. రెండు మ్యాచ్‌లలోనూ ముంబై మిడిలార్డర్ బ్యాటర్లు స్ట్రైక్‌ను రొటేట్ చేయలేకపోయారు.

సెట్ అయ్యాకా వికెట్ పడకుండా చూసుకోవాలి..
రెండు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ బాగానే ఆరంభించాడు. రెండు మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ కూడా సెట్ అయ్యాడు. దీని తర్వాత ఎవరూ హాఫ్ సెంచరీని చేరుకోలేకపోయారు. సెట్ బ్యాట్స్‌మన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోతే ఏ జట్టు కూడా పెద్ద స్కోరు చేయలేదు.

Story first published: Monday, March 31, 2025, 18:00 [IST]
Other articles published on Mar 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+