Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: కోల్‌కతా బ్యాటర్లపై బుమ్రా దండయాత్ర.. భారీ స్కోరును చేజార్చుకున్న కేకేఆర్

MI vs KKR : Bumrah shakes Kolkata batters, KKR score 165

ఐపీఎల్-2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. ముంబైకి 166పరుగుల టార్గెట్ ఇచ్చింది. తొలుత ముంబై బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నా.. చివర్లో జస్పీత్ బుమ్రా 5వికెట్లతో చెలరేగి బౌలింగ్ చేయడంతో కేకేఆర్ 165పరుగులు మాత్రమే చేయగలిగింది. జస్పీత్ బుమ్రా 4-1-10-5 ప్రదర్శనతో తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ చేశాడు.

ఆదిలో అదుర్స్

ఆదిలో అదుర్స్

బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యార్ (43పరుగులు 24బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) వీరవిహారం చేశాడు. మరో ఓపెనర్ అజింక్యా రహానే (25పరుగులు 24బంతుల్లో)తో కలిసి 5.4ఓవర్లలోనే 60పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్ షిప్ దక్కింది. వెంకటేష్ అయ్యార్ ఔటయ్యాక కూడా నితీష్ రాణా (43పరుగులు 26బంతుల్లో 3ఫోర్లు 4సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దీంతో కో‌ల్‌కతా స్కోరు బోర్డు పరుగులెత్తింది. అయితే తొలుత వెంకటేష్ అయ్యార్‌ను ఔట్ చేసిన కుమార్ కార్తికేయ తర్వాత రహానేను పెవిలియన్‌కు పంపించాడు.

చివర్లో తుస్

చివర్లో తుస్

అయినప్పటికీ 13ఓవర్లకు స్కోరు బోర్డు 2వికెట్లే కోల్పోయి 123పరుగులతో కేకేఆర్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (6)ను 14ఓవర్ తొలి బంతికి మురుగన్ అశ్విన్ ఔట్ చేయడంతో కేకేఆర్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయలేదు. రింకూ సింగ్ (23పరుగులు) కాస్త పోరాడడంతో కేకేఆర్ 165పరుగులైన చేయగలిగింది.

కోల్‌కతాపై దండెత్తిన బుమ్రా

కోల్‌కతాపై దండెత్తిన బుమ్రా

ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ పటిమను ఎంత కొనియాడినా తక్కువే. నిప్పులు చెరిగే బంతులతో కేకేఆర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ పేసు గుర్రం 15ఓవర్లో ప్రమాదకర రస్సెస్ (9)ను ఔట్ చేసి మ్యాచ్ మూమెంటమ్ చేంజ్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో మంచి టచ్ తో ఆడుతున్న నితీష్ రానాను కూడా ఔట్ చేసి మ్యాచ్‌ను ముంబై సైడ్ మార్చాడు. ఇక 18ఓవర్ బంతిని అందుకున్న బుమ్రా రెచ్చిపోయాడు. ఆ ఓవర్ తొలి బంతికి జాక్సన్ (5)ను ఔట్ చేసిన బుమ్రా, తర్వాత 3, 4బంతులకు కమ్మిన్ (0), సునీల్ నరైన్ (0)లను ఔట్ చేసి కోల్ కతాకు కోలుకోలేని షాకిచ్చాడు. ఇకఆ ఓవర్లో మొత్తం 3వికెట్లు తీసిన బుమ్రా మెయిడిన్ వేశాడు. ఇక ఆఖరి ఓవర్లోనూ బుమ్రా ప్రతాపం కొనసాగింది. క్రీజులో ఉన్న రింకూసింగ్ బుమ్రా బౌలింగ్లో ఏమాత్రం హిట్టింగ్ చేయలేకపోయాడు. దీంతో ఆ ఓవర్లో ఒకే ఒక రన్ వచ్చింది.

తుది జట్లు

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యార్, శ్రేయస్ అయ్యార్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ 1I): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, రమన్‌దీప్ సింగ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

Story first published: Monday, May 9, 2022, 21:54 [IST]
Other articles published on May 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+