Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఆరు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. హిట్ మ్యాన్ ధాటికి పవర్‌ప్లేలో ముంబై ఏకంగా 75 పరుగులు చేసింది.

అయితే ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ శర్మ 1000 పరుగుల మార్క్‌ను అందుకుని అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై 1000 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్రకెక్కాడు. రోహిత్ తన ఐపీఎల్ కెరీరర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీపై వెయ్యి పరుగులు సాధించాడు.

MI vs DC Rohit Sharma Joins Elite Club 3rd Batsman with 1000 Runs Against Multiple Opponents in IPL

రోహిత్ కంటే ముందు ఈ ఘనతను డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి అందుకున్నారు. వార్నర్ పంజాబ్ కింగ్స్, కేకేఆర్‌పై, కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000+ స్కోరు సాధించారు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అర్ధశతకానికి చేరువవుతున్న రోహిత్‌ను అక్షర్ పటేల్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.

49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్‌లో రోహిత్ వరుసగా మూడు బంతులకు పరుగులు చేయలేకపోయాడు. దీంతో నాలుగో బంతిని ముందుకు వచ్చి రోహిత్ షాట్‌కు యత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యాడు. ఐపీఎల్‌లో అక్షర్ పటేల్ వేసిన 69 బంతుల్ని ఎదుర్కొన్న రోహిత్ 63 పరుగులు చేశాడు. మూడు సార్లు ఔటయ్యాడు. 28 బంతులకు పరుగులేమి చేయలేకపోయాడు.

కాగా, ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ డకౌటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌కు చేరాడు. నోకియా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి జేక్ ఫ్రేజర్ చేతికి చిక్కాడు. ఐపీఎల్‌లో సూర్యకుమార్ వర్సెస్ నోకియా పోటీలో సూర్యపై నోకియాదే పైచేయి. 15 బంతుల్లో 18 పరుగులు చేసిన సూర్య రెండు సార్లు నోకియా చేతిలో ఔటయ్యాడు.

Story first published: Sunday, April 7, 2024, 16:29 [IST]
Other articles published on Apr 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+