
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి ముంబైకి భారీ స్కోర్ అందించాడు. అలాగే ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మ్యాచ్ మొత్తం భారీ షాట్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫెవరేట్ షాట్ అయినా హెలికాప్టర్ షాట్‌ను ఇషాన్ కిషన్ ఆడడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఢిల్లీ క్యాపిల్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లోని నాల్గో బంతిని ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ధోని తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడాడు. యార్కర్‌గా వేసిన బంతిని లెగ్ సైడ్ వైపు ఇషాన్ కిషన్ అద్భుతంగా హెలికాప్టర్ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి బౌండరీ వెళ్లింది. క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని ఫెవరేట్ షాట్ అయినా హెలికాప్టర్ షాట్‌ను ఇషాన్ కూడా ఆడడం ప్రస్తుతం నెట్టింటై వైరల్‌గా మారింది. ఈ షాట్ చూసిన పలువురు ఇషాన్ కిషన్‌ను నయా ధోనిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ధోని తన హెలికాప్టర్ షాట్‌తో ఫోర్లు, సిక్సులు బాదుతాడనే సంగతి తెలిసిందే. కాగా ధోని, ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా జార్ఘండ్‌కే చెందిన వారు కావడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ చెలరేగాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన కిషన్ చివరి వరకు ఆడి అజేయంగా నిలిచాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొని 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కిషన్ 11 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. అయితే ఇషాన్ కిషన్ చెలరేగినప్పటికీ ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
స్కోర్లు:
ముంబై ఇండియన్స్: 177-5
ఢిల్లీ క్యాపిటల్స్: 179-6.