For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs DC: ముంబైని వ‌ద‌ల‌ని ద‌రిద్రం.. సంచ‌ల‌న ఆట‌తో ఢిల్లీని గెలిపించిన ల‌లిత్, అక్ష‌ర్ పటేల్‌

MI vs DC: Lalith yadav(48*) and Axar Patel(38) Super Batting.. Delhi Capitals Beat Mumbai Indians
IPL 2022: Axar And Lalit Shines As DC Defeat MI | Match Highlights | Oneindia Telugu

ముంబై: ముంబై ఇండియ‌న్స్‌ను ద‌రిద్రం వ‌దిలిపెట్ట‌లేదు. విజ‌యం ఖాయం అనుకున్న మ్యాచ్‌లో చివ‌ర్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అనూహ్యంగా చెల‌రేగ‌డంతో వ‌రుస‌గా ప‌దో సారి ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్‌ను ఓట‌మితోనే ఆరంభించింది. ఇక 178 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో 72 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన ద‌శ నుంచి అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో 10 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌య‌కేత‌నం ఎగుర వేసింది. ల‌లిత్ యాద‌వ్ (48*), అక్ష‌ర్ ప‌టేల్ (38*), శార్దూల్ ఠాకూర్ (22) ఆ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఇక లలిత్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్ అయితే 30 బంతుల్లోనే అజేయంగా 77 ప‌రుగులు జోడించి తొలి మ్యాచ్‌లో ఢిల్లీకి విజ‌యాన్ని అందించారు. ముంబై బౌల‌ర్ డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవ‌ర్‌తో మ్యాచ్ మ‌లుపు తిరిగింది.

దెబ్బ కొట్టిన ముంబై బౌల‌ర్లు

178 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు ఆరంభంలోనే దెబ్బ‌కొట్టారు. ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ మురుగన్ అశ్విన్ ఇన్నింగ్స్ నాల్గో ఓవ‌ర్లో రెండు వికెట్ల‌తో చెల‌రేగాడు. 21 ప‌రుగులు చేసిన టిమ్ సీఫెర్టను, మ‌న్ దీప్ సింగ్‌ను డ‌కౌట్ చేశాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో ఒక్క ప‌రుగుల మాత్ర‌మే చేసిన రిష‌బ్ పంత్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో ఢిల్లీ 32 ప‌రుగుల‌కే టాప్ 3 వికెట్ల‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత 10వ ఓవ‌ర్లో ముంబై బౌల‌ర్ తులసి తంపి చెల‌రేగాడు. ఒకే ఓవ‌ర్లో పృథ్వీ షా (38), రోవ్మాన్ పావెల్ (0)ను ఫెమిలియ‌న్ పంప‌డంతో ఢిల్లీ 72 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

గెలిపించిన ల‌లిత్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్‌

ఈ క్ర‌మంలో శార్దూల్ ఠాకూర్‌తో క‌లిసి ల‌లిత్ యాద‌వ్ ఢిల్లీని ఆదుకున్నాడు. వీరిద్ద‌రు ఆరో వికెట్‌కు 32 ప‌రుగులు జోడించాక శార్దూల్ (22)ను తులసి తంపి ఔట్ చేయ‌డంతో ఆ జ‌ట్టు 104 ప‌రుగుల‌కు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో ల‌లిత్ యాద‌వ్‌, అక్ష‌ర్ పటేల్ ఊహించ‌ని విధంగా మ్యాచ్‌ను మ‌లుపుతిప్పారు. అద్భుత భాగ‌స్వామ్యంతో జ‌ట్టును ఆదుకోవ‌డంతోపాటు విజ‌య‌తీరాల‌కు చేర్చారు. డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవ‌ర్లో వీరిద్ద‌రు 24 ప‌రుగులు రాబ‌ట్ట‌డంతో మ్యాచ్ మ‌లుపుతిరిగింది. ఢిల్లీ మ‌రో 10 బంతులు మిగిలి ఉండ‌గానే 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో 17 బంతుల్లోనే 38 ప‌రుగులు చేసిన అక్ష‌ర్ ప‌టేట్‌, 38 బంతుల్లో 48 ప‌రుగులు చేసిన లలిత్ యాద‌వ్ అజేయంగా నిలిచారు. వీరిద్ద‌రు ఏడో వికెట్‌కు అజేయంగా 30 బంతుల్లోనే అజేయంగా 77 ప‌రుగులు జోడించారు. అక్ష‌ర్ ప‌టేల్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉండ‌గా.. ల‌లిత్ యాద‌వ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ముంబై బౌల‌ర్ల‌లో తులసి తంపి 3, మురుగ‌న్ అశ్విన్ 2, మిల్స్ ఒక వికెట్ తీశారు.

చెల‌రేగిన ఇషాన్ కిష‌న్‌

అంత‌కుముందు ఇషాన్ కిషన్(48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 నాటౌట్) షాన్‌దార్ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్‌కు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), తిలక్ వర్మ(15 బంతుల్లో 3 ఫోర్లతో 22) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, March 27, 2022, 19:49 [IST]
Other articles published on Mar 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+