For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs DC Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! హెడ్ టు హెడ్ రికార్డ్స్!!

'

MI vs DC Dream11 Prediction: Captain, Vice-Captain Tips And Head to Head Records For Match 46

హైదరాబాద్: ఐపీఎల్​ 2021లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈరోజు డబుల్ ధమాకాలో భాగంగా మొదటి మ్యాచులో ముంబై ఇండియన్స్​ (ఎంఐ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్లు తలపడుతున్నాయి. షార్జాలోని షార్జా క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలు కానుంనుండగా.. టాస్ 3 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్‌ చేరేందుకు ప్రయత్నిస్తుంటే.. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలుపొంది చెన్నైకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

ఈ సీజన్‌లో జరుగుతోన్న 46వ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్​, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య షార్జాలో జరగనుంది. గత సంవత్సరం వరకు షార్జా పిచ్ బ్యాటర్లకు అనుకూలించింది. ఇప్పుడు మాత్రం స్పిన్నర్లకు సహకరిస్తోంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ రెండో దశలో ఇక్కడ ఇప్పటివరకు భారీ స్కోర్ నమోదు కాలేదు. గత 4 మ్యాచ్‌లలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 157. ఇందులో ఛేజింగ్ చేసిన టీమ్ 3 సార్లు గెలిచింది. ఈ వికెట్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 140. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 16 సార్లు గెలుపొందగా.. ఢిల్లీ 13 విజయాలు అందుకుంది. షార్జా క్రికెట్‌ స్టేడియంలోనాలుగు ఇరు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా.. అందులో ఢిల్లీ గెలుపొందింది. ఐపీఎల్ 2021లో ముంబై , ఢిల్లీ తలపడిన మ్యాచులో పంత్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు ముంబై గెలుపొందింది. కేవలం ఒకే ఒక మ్యాచ్ ఢిల్లీ గెలిచింది. 29 మ్యాచుల్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై 11 విజయాలు సాధించగా.. ఢిల్లీ 5 సార్లు గెలిచింది. చేజింగ్లో ముంబై 5సార్లు.. ఢిల్లీ 8సార్లు విజయాలు అందుకున్నాయి. ఢిల్లీపై కృనాల్ పాండ్యా (86) అత్యధిక స్కోర్ చేయగా.. ముంబైపై వీరేందర్ సెహ్వాగ్ (95 నాటౌట్) చేశాడు.

వారిపైనే ముంబై ఆశలు:

వారిపైనే ముంబై ఆశలు:

ఈ సీజన్​లో ముంబై బ్యాటింగ్​లో దారుణంగా విఫలమవుతోంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, రోహిత్ శర్మలు సరైన ఆరంభాలు ఇవ్వట్లేదు. ఒకరు మెరిస్తే.. మరొకరు త్వరగానే ఔట్ అవుతున్నారు. దాంతో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు కావట్లేదు. అయినా కూడా కీలక సమయంలో చెలరేగే ఈ జోడీపై అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్​లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్​లో తేలిపోయాడు. ఇప్పటికైనా అతడు గాడిలో పడాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్​లో ఆకట్టుకున్న సౌరభ్ తివారిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇషాన్ కిషన్‌కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. గత మ్యాచులో సత్తాచాటిన హార్దిక్ పాండ్యా (40) ఈ మ్యాచ్లోనూ రాణించాలని ముంబై మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కీరన్ పొలార్డ్​ ఫినిషర్​ రోల్​ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా రాణిస్తున్నా.. ట్రెంట్ బోల్ట్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. షార్జా పిచ్​ కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరికి తోడు మరో స్పిన్నర్ (జయంత్ యాదవ్) జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మూడో పేసర్ అవసరం అనుకుంటే.. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, ఆడమ్ మిల్నేలలో ఒకరు జట్టులోకి రానున్నారు.

పృథ్వీ షాకు చోటు:

పృథ్వీ షాకు చోటు:

ఈ సీజన్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీకి షాకిచ్చింది కోల్​కతా. దీంతో ఢిల్లీ తమ బలహీనతల్ని గుర్తించి ఈ మ్యాచ్​లో గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్ మాత్రమే పర్వాలేదనిపించారు. గత మ్యాచ్​లో ఆడని ఓపెనర్ పృథ్వీ షా ఈ మ్యాచ్​లో ఆడే అవకాశం ఉంది. ఆల్​రౌండర్ మార్కస్ స్టోయినిస్​కు కూడా చోటు దక్కే వీలుంది. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్​ సత్తాచాటాలని యాజమాన్యం భావిస్తోంది. కగిసో రబడా, అన్రిన్‌ నోర్జ్ సత్తాచాటుతున్నారు.

తుది జట్టు (అంచనా):

తుది జట్టు (అంచనా):

ముంబై ఇండియన్స్: రోహిత్‌ శర్మ (కెఫైన్), క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారీ, హార్ధిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్ పాండ్యా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌/జయంత్‌ యాదవ్‌/ఆడమ్ మిల్నే, రాహుల్‌ చహార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: స్టీవ్‌ స్మిత్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షీమ్రాన్‌ హెట్మయర్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, ఆర్ అశ్విన్‌, కగిసో రబడా, అన్రిన్‌ నోర్జ్/అమిత్‌ మిశ్రా, ఆవేశ్ ఖాన్‌.

డ్రీమ్ 11 టీమ్:

డ్రీమ్ 11 టీమ్:

క్వింటన్ డికాక్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్, కాగిసో రబడా, అన్రిన్‌ నోర్జ్.

Story first published: Saturday, October 2, 2021, 14:47 [IST]
Other articles published on Oct 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+