Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: ఎంత ప‌ని చేస్తివిరా డేనియల్ సామ్స్.. ముంబై కొంప ముంచిన‌వుగా.. నెట్టింట ట్రోలింగ్‌!

MI vs DC: Daniel Sams Given 24 Runs IN 18th Over.. Mumbai Indians Fans Troling On Social Media

ముంబై: ఐదు ఐపీఎల్ ట్రోఫీల విజేత ముంబై ఇండియ‌న్స్ మ‌రో సారి సీజ‌న్‌ను ఓట‌మితోనే ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో వ‌రుస‌గా ఆ జ‌ట్టు ప‌దో సారి ఐపీఎల్‌ను ఓట‌మితోనే ప్రారంభించింది. ఓ ద‌శ‌లో ముంబై విజ‌యం ఖాయంగా క‌నిపించిన అనూహ్య రీతిలో ఢిల్లీ బ్యాట‌ర్లు ల‌లిత్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్ చెల‌రేగి ముంబైకి విజయాన్ని దూరం చేశారు. ముఖ్యంగా 18వ ఓవ‌ర్లో భారీగా ప‌రుగులిచ్చిన డేనియల్ సామ్స్ ముంబై ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాడు. దీంతో డేనియల్ సామ్స్‌ను నెట్టింట ముంబై అభిమానులు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

భారీగా ప‌రుగులిచ్చిన డేనియల్ సామ్స్‌

మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెల‌వాలంటే మ‌రో 3 ఓవ‌ర్ల‌లో 28 ప‌రుగులు చేయాల్సిన స‌మ‌యంలో డేనియల్ సామ్స్‌కు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బాల్ ఇచ్చాడు. అప్పుడు క్రీజులో లలిత్ యాద‌వ్, అక్ష‌ర్ పటేల్ ఉన్నారు. ఇక డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవ‌ర్ తొలి బంతిని అక్ష‌ర్ ప‌టేల్ సిక్సు బాదాడు. రెండో బంతికి సింగిల్ తీయ‌గా.. ల‌లిత్ యాద‌వ్ స్ట్రైకింగ్‌కు వ‌చ్చాడు. ఆ ఓవ‌ర్ మూడో బంతిని సిక్సు బాదిన ల‌లిత్ యాద‌వ్.. నాలుగో బంతిని ఫోర్ బాదాడు. ఐదో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఆరో బంతిని అక్ష‌ర్ పటేల్ సిక్సు బాదేశాడు. ఆ ఓవ‌ర్లో వ‌రుస‌గా 6 1 6 4 1 6 ప‌రుగులు వ‌చ్చాయి. అంటే ఆ ఒక్క ఓవ‌ర్లోనే 24 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ ముంబై చేయి జారిపోయింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్ల‌లోనే డేనియ‌ల్ సామ్స్ 57 ప‌రుగులిచ్చి ముంబై ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాడు. ఢిల్లీ విజ‌యానికి మ‌రో 4 ర‌న్స్ మాత్ర‌మే కావ‌డంతో 19వ ఓవ‌ర్లో ఢిల్లీ విజ‌యాన్ని అందుకుంది.

నెట్టింట ట్రోలింగ్‌

డేనియ‌ల్ సామ్స్ ఈ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌పై ముంబై ఇండియ‌న్స్ అభిమానులు మండిప‌డుతున్నారు. అత‌డి వ‌ల్లే ముంబై మ్యాచ్ ఓడిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో డేనియ‌ల్ సామ్స్‌ను సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు అభిమానులు ఎంత ప‌ని చేస్తివిరా డేనియ‌ల్ సామ్స్.. ముంబై కొంప ముంచిన‌వుగా అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక డేనియ‌ల్ సామ్స్‌ను మ‌రో మ్యాచ్ ఆడించొద్ద‌ని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను కోరుతున్నారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన డేనియ‌ల్ సామ్స్‌ను మెగా వేలంలో ముంబై ఇండియ‌న్స్ 2 కోట్ల 60 ల‌క్షల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లువురు నెటిజ‌న్లు ముంబైకి 2 కోట్ల 60 ల‌క్షల రూపాయ‌లు బొక్క అంటూ డేనియ‌ల్ సామ్స్‌ను ట్రోలింగ్‌కు గురి చేస్తున్నారు.

ముంబై ఓట‌మి

కాగా ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైంది. ముంబైపై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. మొద‌టి బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేయ‌గా.. మ‌రో 10 బంతులు మిగిలి ఉండ‌గానే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ల‌క్ష్యాన్ని చేధించింది.

Story first published: Sunday, March 27, 2022, 21:07 [IST]
Other articles published on Mar 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+