For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ వల్లే ఓటమి.. ఇలాంటి చెత్త ఆట చూడలే- సునీల్ గవాస్కర్

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఓటమికి హార్దిక్ కారణం అని మండిపడ్డాడు. గత కొంతకాలంలో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ హార్దిక్‌దే అని ఘూటు వ్యాఖ్యలు చేశాడు. ముంబై-సీఎస్కే మ్యాచ్ గురించి తన స్టైల్‌లో గవాస్కర్ విశ్లేషించాడు.

వాంఖడే వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు.

MI vs CSK Sunil Gavaskar Pins Mumbai s Defeat on Hardik s worst Bowling

ఆఖరి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోనీ దెబ్బకి హార్దిక్ 20వ ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

''గత కొంతకాలంగా నేను చూసిన చెత్త బౌలింగ్ ఇదే. నా హీరో కోసం సమర్పించుకుంటాను అన్నట్లుగా ఉంది. ఈ తరహాలో బ్యాటింగ్ చేస్తాను, అతడు సిక్సర్లు సాధిస్తాడనే పరిస్థితి కనిపించింది. ఓ సిక్సర్ ఫర్వాలేదు. కానీ తర్వాత బంతిని కూడా లెంగ్త్ బాల్ వేశాడు. బ్యాటర్ దాని కోసమే ఎదురుచూస్తాడని తెలుసు. ఇక మూడో బంతి లెగ్ సైడ్ ఫుల్ టాస్ వేశాడు. ధోనీ దాని కోసమే చూశాడు. సిక్సర్ సాధించాడు. ఇది కచ్చితంగా సాధారణమైన బౌలింగ్, సాధారణ కెప్టెన్సీ. సీఎస్కే 185-190 పరుగులకే కట్టడి చేయాల్సింది'' అని హార్దిక్‌ను ఉద్దేశిస్తూ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Monday, April 15, 2024, 8:34 [IST]
Other articles published on Apr 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+