Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs CSK: సూర్యకు షాక్..చెన్నైతో ఆడే ముంబై తుదిజట్టు ఇదే!

ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. అత్యధిక టైటిళ్లు సాధించిన ముంబై ఇండియన్స్‌ - చెన్నై సూపర్ కింగ్స్ రేపు తలపడనున్నాయి. వాంఖడే వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గత 16 సీజనల్లో ఇరు జట్లు కలిసి ఏకంగా పది టైటిళ్లు సాధించిన విషయం తెలిసిందే. చెరో అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించాయి.

ఐపీఎల్-2024 లీగ్ స్టేజ్‌లో ముంబై, చెన్నై ఒక్కసారి మాత్రమే పోటీపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సీజన్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, ఏడో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై తిరిగి గెలుపు బాట పట్టింది.

MI vs CSK Mumbai Indians Predicted Playing XI Against Chennai Super Kings Shock for Surya

ముంబైదే పైచేయి
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌ల్లో నెగ్గగా, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే 2022 నుంచి చెన్నైదే పైచేయి. గత రెండు సీజన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై మూడింట్లో గెలిచింది.

రేపు సీఎస్కేతో జరిగే మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కొనసాగించడం కంటే, ప్లేయర్ల పనిభారంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌‌ను మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగించాలనుకుంటుంది. సర్జరీ కారణంగా ఆటకు దాదాపు మూడు నెలలు దూరమైన సూర్య ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

MI vs CSK Mumbai Indians Predicted Playing XI Against Chennai Super Kings Shock for Surya

అయితే ఈ సీజన్ ప్రారంభానికి సూర్య అందుబాటులో లేడు. ఎన్సీఏ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. మరోసారి ప్రయత్నించి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దీంతో అతడిని ఫీల్డింగ్‌కు దూరం చేయాలని, కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలని ముంబై మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నిర్ణయం సూర్యకు నిరాశ కలిగిస్తోంది. అన్ని విభాగాల్లో సత్తాచాటి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలనుకున్న సూర్యకు ఇది చేదు వార్తే. కాగా, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆడిన తుదిజట్టుతోనే సీఎస్కే మ్యాచ్‌లోనూ ముంబై బరిలోకి దిగనుంది.

ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, షెఫార్డ్, మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మద్వల్
ఇంపాక్ట్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్

Story first published: Saturday, April 13, 2024, 13:26 [IST]
Other articles published on Apr 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+