ముంబైతో మ్యాచ్: ధోనికి పొంచి ఉన్న ఓ గండం!

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమెరగని సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించాలని ముంబై ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మరోవైపు ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే మ్యాచ్‌లో గెలిచి, రెండింట పరాజయం పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఓ గండం పొంచి ఉంది. గతంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ధోని ఎక్కువ ఇబ్బందులు పడ్డాడు. గత సీజన్లలో బుమ్రా బౌలింగ్‌లో ధోని మొత్తం 35 బంతులు ఎదుర్కొని 38 పరుగులే చేశాడు.

బుమ్రా బౌలింగ్‌లో
అంతేకాదు బుమ్రా బౌలింగ్‌లోనే ధోని అత్యధికంగా మూడు సార్లు ఔటయ్యాడు. ఆ తర్వాత లసిత్ మలింగ్ బౌలింగ్‌లో 57 బంతులను ఎదుర్కొని 75 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు మలింగ్ బౌలింగ్ ధోని రెండు సార్లు ఔటయ్యాడు. దీంతో వీరిద్దరి బౌలింగ్‌లో ధోని ఆచితూచి ఆడాల్సి ఉంది. దీంతో ఇరు జట్లు అటు ధోని, బుమ్రా ప్రదర్శనలపై ఆశలు పెట్టుకున్నాయి.

చెన్నైని అడ్డుకునేనా?
అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ముంబై ఇండియన్స్ అడ్డుకునేలా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి రికార్డు ఉన్నా... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన గణాంకాలను చూస్తే ఈ విషయం తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడగా... అందులో 13సార్లు ముంబై, 11 సార్లు చెన్నై విజయం సాధించింది.

చివరి ఐదు మ్యాచుల్లో ముంబైదే విజయం
అయితే, చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు ముంబై ఇండియన్స్ గెలవడం విశేషం. అయితే, ఈ సీజన్‌లో సీఎస్‌కే అద్భుత ప్రదర్శన చేస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఫీల్డింగ్ మినహా అన్ని రంగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ధోని ఫామ్‌లోకి రావడం ముంబైని కలవరపెడుతోంది.

రాజస్థాన్‌తో బౌండరీల మోత
ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ధోని ఆర్సీబీతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. ఆ తర్వాత ఢిల్లీ మ్యాచ్‌లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 75 పరుగులు చేసి చెన్నై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications