Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ టీమ్ ఇదే: రెండోరోజు హవా: అది జస్ట్ ట్రైలర్: తొక్కుకుంటూ వెళ్లడమే బెంగళూరు: తుఫాన్ రావడానికి

MI team 2022: Ambanis Mumbai Indians all set to dominate during IPL auction 2022 Day 2

బెంగళూరు: తుఫాన్ రావడానికి ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెబుతుంటారు. తుఫాన్ వెళ్లిన తరువాత మిగిలేది విధ్వంసమే. దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సారథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్ టీమ్.. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే కనిపిస్తోంది. తొలి రోజు ఇద్దరు ప్లేయర్లను తీసుకోవడానికే పరిమితమైన ఈ ఫ్రాంఛైజీ- రెండో రోజు విజ‌ృంభించడం ఖాయం. తాను కోరుకున్న ప్లేయర్ కోసం ఎంత మొత్తమైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడకపోవచ్చు.

 అది ట్రైలర్ మాత్రమే..

అది ట్రైలర్ మాత్రమే..

తొలి రోజు ఇషాన్ కిషన్, డెవాల్డ్ ట్రెవిస్‌, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేసుకోవడానికి ఆ జట్టు ఎంత గట్టిగా పోరాడిందో మనం చూశాం. అతని కోసం 15 కోట్ల 25 లక్షల రూపాయలను చెల్లించడానికి కూడా వెనుకాడలేదు. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో పోటీ పడింది ముంబై. ఇంకో రెండు కోట్ల రూపాయలు పెరిగినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టుగా వ్యవహరించింది.

 ఇప్పటికి ఎనిమిది మందే..

ఇప్పటికి ఎనిమిది మందే..

ఇషాన్ కిషన్ విషయంలో 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి వెనుకాడని ముంబై ఇండియన్స్- రెండో రోజు కూడా అదే తరహాలో వేలంపాటను డామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. రిటైన్ చేసుకున్న కేప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ కీరన్ పొల్లార్డ్, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు తోడుగా.. కొత్తగా జట్టులోకి ఇషాన్ కిషన్, డెవాల్డ్ ట్రెవిస్‌, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్‌ వచ్చారు. ఇంకా 17 మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.

 బరువుగా పర్స్..

బరువుగా పర్స్..

ముంబై ఇండియన్స్ పర్స్ ఇంకా బరువుగానే ఉంది. 27 కోట్ల 85 లక్షల రూపాయలు మిగిలే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 20 కోట్ల రూపాయలకు పైగా మొత్తం బ్యాలెన్స్ ఉంది. మిగిలిన వాటి వద్ద ఈ స్థాయిలో బ్యాలెన్స్ లేదు. ఫలితంగా- తాను సెలెక్ట్ చేయదలచుకున్న ప్లేయర్‌ను తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ భారీగా ఖర్చు చేస్తుందనే అంచనాల ఉన్నాయి. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ నుంచి తప్ప మిగిలిన జట్లేవీ ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టే సాహసం చేయకపోవచ్చు.

ఆల్‌రౌండర్ల కోసం..

ఆల్‌రౌండర్ల కోసం..

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్లు ఓడియన్ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్‌పై ముంబై ఇండియన్స్ కన్నేసింది. వారిని తీసుకోవడానికి భారీగానే ఖర్చు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 27 కోట్ల రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉన్నందున.. వారికోసం ఎంతవరకైనా వెళ్లొచ్చు. టాలెంట్ ఉన్న అన్‌క్యాప్డ్ క్రికెటర్ల కోసం లిమిటెడ్‌గా బడ్జెట్‌ను అట్టి పెట్టుకుని, స్టార్ ప్లేయర్లపై దృష్టి సారిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇప్పటిదాకా సెలెక్ట్ అయిన ముంబై టీమ్ ఇదే..

ఇప్పటిదాకా సెలెక్ట్ అయిన ముంబై టీమ్ ఇదే..

కేప్టెన్ రోహిత్ శర్మ (రిటైన్డ్)-రూ.16 కోట్లు, ఆల్‌రౌండర్ కీరన్ పొల్లార్డ్ (రిటైన్డ్)-రూ.6 కోట్లు, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (రిటైన్డ్)-రూ.12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్‌ (రిటైన్డ్)-రూ.8 కోట్లు, ఇషాన్ కిషన్-రూ.15.25 కోట్లు, డెవాల్డ్ బ్రెవిస్‌-రూ.3 కోట్లు, బాసిల్ థంపి-రూ.30 లక్షలు, మురుగన్ అశ్విన్‌-రూ.1.6 కోట్లతో ఇప్పటిదాకా జట్టును సమకూర్చుకుంది ముంబై ఇండియన్స్.

Story first published: Sunday, February 13, 2022, 10:48 [IST]
Other articles published on Feb 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+