For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI Full Squad 2022: కిష‌న్‌, ఆర్చ‌ర్, హెడ్‌ను భారీ ధ‌ర‌కు కొన్న అంబానీ.. ముంబై ఇండియ‌న్స్ పూర్తి జ‌ట్టు ఇదే!

MI Squad 2022: Check Out The Full Team of Mumbai Indians After IPL 2022 Mega Auctions
IPL Auction 2022 : Mumbai Indians Full Squad For IPL 2022 | Oneindia Telugu

బెంగ‌ళూరు: క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా వీక్షించిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలం ముగిసింది. మొత్తం 600 మంది ఆట‌గాళ్లు వేలంలో పాల్గొన‌గా 204 మంది మాత్ర‌మే అమ్ముడుపోయారు. మిగ‌తా వారంతా అమ్ముడుపోని ఆట‌గాళ్ల జాబితాలో చేరారు. ఈ క్ర‌మంలో వేలంలో ప‌లు సంచ‌ల‌నాలు కూడా న‌మోద‌య్యాయి. మొత్తానికి వేలం ముగియ‌డంతో అభిమానులంతా ప్ర‌స్తుతం ఏం టీం ఎలాంటి ఆట‌గాళ్ల‌తో ఉంది అనే అంశంపై దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో ఐపీఎల్ ట్రోఫీని ఎక్కువ సార్లు గెలిచిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును తీక్ష‌ణంగా ప‌రీక్షిస్తున్నారు.

నలుగురిని రిటెన్ష‌న్‌

నలుగురిని రిటెన్ష‌న్‌

మెగా వేలానికి ముందు ముంబై ఇండియ‌న్స్ నలుగురు ఆట‌గాళ్ల‌ను రిటెన్ష‌న్ చేసుకుంది. ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ చేసుకున్న ఆట‌గాళ్ల జాబితాలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, పేస్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్‌, బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఉన్నారు. ఆ త‌ర్వాత వేలంలో ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల‌ను ప‌రిశీలిస్తే ముంబై గ‌తంలో మాదిరిగానే టేబుల్‌పై బ‌లంగా క‌నిపిస్తుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మొత్తం 25 మందిని కొనుగోలు

మొత్తం 25 మందిని కొనుగోలు

మెగా వేలంలో ముంబై ఇండియ‌న్స్ మొత్తం 21 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అంత‌కుముందు రిటైన్ చేసుకున్న నలుగురు ఆట‌గాళ్ల‌ను క‌లుపుకుంటే ఆ జ‌ట్టులోని మొత్తం స‌భ్యుల సంఖ్య 25కు చేరింది. ఇందులో 18 మంది భార‌త ఆట‌గాళ్లు ఉండ‌గా, ఏడుగురు విదేశీయులు ఉన్నారు. మొత్తం 25 మంది జ‌ట్టులో ఏడుగురు బ్యాట‌ర్లు, ఏడుగురు బౌల‌ర్లు, 11 మంది ఆల్‌రౌండ‌ర్లు ఉన్నారు. కాగా వేలంలో ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయగా ముంబై ద‌గ్గ‌ర ఇంకా 10 లక్ష‌ల రూపాయ‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి.

ముగ్గురికి అత్య‌ధిక ధ‌ర‌

ముగ్గురికి అత్య‌ధిక ధ‌ర‌

మెగా వేలంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించిన‌ ముంబై ఇండియ‌న్స్ ముగ్గురు ఆట‌గాళ్ల‌ను అత్య‌ధిక ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసింది. ఇషాన్ కిష‌న్‌కు సీజ‌న్‌లోనే అత్య‌ధికంగా 15 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించింది. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ టిమ్ డేవిడ్‌ను రూ. 8.25 కోట్లకు విక్ర‌యించింది. ఇక ఇంగ్లండ్ ఆట‌గాడు జొఫ్రా ఆర్చర్‌ను 8 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. మిగ‌తా వారిని వీలైనంత త‌క్కువ ధ‌ర‌కే తీసుకుంది. తెలుగు ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ‌ను రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేయ‌గా, దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్‌ను రూ.30 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది.

బ్యాట‌ర్లు, బౌల‌ర్లు, ఆల్‌రౌండ‌ర్లు వీళ్లే

ఈ లీగ్‌లో త‌మ బ్యాట‌ర్లుగా ముంబై ఇండియ‌న్స్‌ రోహిత్‌శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, దేవల్డ్‌ బ్రేవిస్‌, అన్‌మోల్‌ ప్రీత్‌, రాహుల్‌ బుద్ధి ఆర్యన్‌ జుయల్‌ను ఎంచుకుంది. ఇక బౌల‌ర్లుగా జ‌స్ప్రీత్‌ బుమ్రా, బాసిల్‌ థంపి, మురుగన్‌ అశ్విన్‌, ఉనాద్కట్‌, మయాంక్‌ మార్కండే, టైమల్‌ మిల్స్‌, రిలే మెరిడిత్‌ను కొనుగోలు చేసింది. ఆల్‌రౌండ‌ర్లుగా కీర‌న్‌ పొలార్డ్‌, తిలక్‌ వర్మ, సంజయ్‌, ఆర్చర్‌, డానియల్‌ శామ్స్‌, టిమ్‌ డేవిడ్‌, అర్షద్‌, రమణ్‌దీప్‌, షోకీన్‌, అర్జున్‌ టెండూల్కర్‌, ఫాబియన్ అలన్‌ను ద‌క్కించుకుంది.

ముంబై పూర్తి జ‌ట్టు

ముంబై పూర్తి జ‌ట్టు

రోహిత్ శర్మ(16 కోట్లు), జ‌స్ప్రీత్‌ బుమ్రా(12 కోట్లు), కీరన్‌ పొలార్డ్‌(6 కోట్లు), సూర్యకుమార్ యాద‌వ్‌(8 కోట్లు), ఇషాన్‌ కిషన్(15.25 కోట్లు), టిమ్‌ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్‌ (ఓవర్సీస్‌-3 కోట్లు), డేనియల్‌ సామ్స్‌ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్‌ వర్మ(1.70 కోట్లు), మురుగన్‌ అశ్విన్‌(1.60 కోట్లు), టైమల్‌ మిల్స్‌ (ఓవర్సీస్‌-1.50 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్‌(1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్‌ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్‌ మార్కండే( 65 లక్షలు), సంజయ్‌ యాదవ్(50 లక్షలు), బసిల్ థంపి(30 లక్షలు), అర్జున్ తెందూల్కర్‌(30 లక్షలు), ఆర్యన్ జుయల్‌, హృతిక్‌ షోకీన్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ బుద్ది, రమణ్‌ దీప్‌ సింగ్‌( వీరంద‌రికీ 20 లక్షలు)

Story first published: Monday, February 14, 2022, 14:31 [IST]
Other articles published on Feb 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+