
హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మను అతడి భార్య రితిక ఇంటర్వ్యూ చేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మను అతడి భార్య సమైరా ముందు నాలుగోసారి టైటిట్ గెలవడం ఎలా ఉందన్న ప్రశ్నకు గాను "ఇదెంతో ప్రత్యేకం. సమైరాతో పాటు నువ్వు కూడా. తనకిదే మొదటి ఐపీఎల్. అయినా చాలా మ్యాచులకు హాజరైంది. ఈ విజయంతో నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సినిమా గల్లీబాయ్ పాటకు డ్యాన్స్ చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది. మరోవైపు నాలుగోసారి టైటిల్ సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి మొత్తం 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.