బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే.. ప్రపంచం ఆగిపోతుందా?.. మాజీ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు!

వెన్నునొప్పి కారణంగా కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్‌కు కూడా అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతను మళ్లీ ఐపీఎల్‌లోనే పునరాగమనం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే అప్పటికి అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే? ఏం చెయ్యాలి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఐపీఎల్‌లో ఏం చెయ్యాలి?
ఈ సమస్యపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ చెప్పినట్లు ముంబై ఇండియన్స్ యాజమాన్యం వినాలని, అవసరమైతే బుమ్రాకు కొన్ని మ్యాచులపాటు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. 'ఎవరైనా సరే ముందు భారత ఆటగాడు. ఆ తర్వాతే ఫ్రాంచైజీ క్రికెట్. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని ఏమాత్రం అనిపించినా బీసీసీఐ ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. అతన్ని మేం ఆడించడం లేదని కరాఖండీగా చెప్పేయాలి' అని చోప్రా అన్నాడు.

ప్రపంచం ఆగిపోదుగా..!
ముంబై తరఫున ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ సీజన్‌లో పునరాగమనం చేస్తున్నాడు. అతనితో కలిసి బుమ్రా ఒక ఏడెనిమిది మ్యాచులు ఆడకపోతే కొంపలేమన్నా మునిగిపోతాయా? ప్రపంచం ఆగిపోతుందా? అని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. అదే సమయంలో ఫిట్‌గా ఉంటే మాత్రం ఏ ఆటగాడైనా ఆడుతూనే ఉండాలని చెప్పాడు. 'ఫిట్‌నెస్ సాధిస్తే ఆడాలి. అప్పుడే మన ఆట మెరుగవుతుంది. కాబట్టి బీసీసీఐ చెప్పినట్లు ముంబై ఇండియన్స్ చేస్తే బాగుంటుంది' అని వివరించాడు.

జడ్డూ బాటలోనే?
బుమ్రా దేశానికి దొరికిన ఒక పెద్ద నిధి అని కొనియాడిన చోప్రా.. అతనికి సంబంధించిన విషయాలను మేనేజ్ చేయడంలో అంత సమస్య రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాగే గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాను నేరుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడించాలా? లేక దేశవాళీల్లో ముందు ఆడించాలా? అని కూడా కొందరు అడుగుతున్నారు. కొన్నిరోజుల క్రితం రవీంద్ర జడేజా కూడా గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ అతన్ని ముందుగా రంజీల్లో ఆడాలని బీసీసీఐ చెప్పింది.

దేశవాళీలు ఆడటమే మంచిది..
తమిళనాడుతో జరిగిన మ్యాచులో జడ్డూ చక్కగా రాణించాడు. ఈ మ్యాచ్ వల్లనే జడేజా మళ్లీ తన ఫామ్ అందుకున్నాడని ఆకాష్ చోప్రా కూడా అన్నాడు. 'బుమ్రా కనుక ఫిట్‌గా ఉంటే ఇరానీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్ ఆడటమే మంచిది. కానీ ఇంకో నెల రోజుల్లో ఐపీఎల్ ఉంది. దానిలోనే అన్ని మ్యాచులు ుమ్రా ఆడతాడో లేదో తెలీదు. అలాంటప్పుడు మూడు నెలల తర్వాత జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గురించి ఇప్పుడే చర్చ ఎందుకు? దానిపై మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉంది' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications