Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing XI: ఈ స్టార్ ఆటగాళ్లకు అవకాశం.. సన్‌రైజర్స్‌తో తలపడే ముంబై తుది జట్టు ఇదే..!

SRH vs MI: తమ చివరి మ్యాచ్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఉత్సాహంగా ఉంది. ముంబై ఇండియన్స్ తమ రాబోయే మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. బుధవారం(ఏప్రిల్ 23) రోజున ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పుటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ 4 గెలిచి మరో 4 ఓడింది. ముంబై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ముంబై తమ 9వ మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తోంది. ప్లే ఆఫ్స్ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని కోరుకుంటోంది. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ స్టార్ ఆటగాళ్లు ఉండనున్నారు.

ఓపెనర్లు వీరే..
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారు. గత మ్యాచ్ లో ముంబై తరపున ఈ ఇద్దరు బ్యాటర్లు బాగా రాణించారు. మరోవైపు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు అర్ధ సెంచరీలు బాదారు. రోహిత్ శర్మ 45 బంతుల్లో 76 పరుగులు చేయగా.. ర్యాన్ రికెల్టన్ 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్లుగా మళ్లీ ఈ ఇద్దరే బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి.

MI Playing XI vs SRH Star Players Return in Mumbai Indians Predicted Lineup

మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఇలా..
సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో రానున్నాడు. సీఎస్కేతో జరిగిన చివరి మ్యాచ్ లో సూర్యకుమార్ అదే స్థానంలో బ్యాటింగ్ చేయడం ద్వారా సంచలనం సృష్టించాడు. సూర్య కుమార్ యాదవ్ 30 బంతుల్లో 68 పరుగులు చేసి సీఎస్కే వెన్ను విరిచాడు. తిలక్ వర్మ నాలుగో స్థానంలో బాధ్యతలు స్వీకరించవచ్చు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్ ముంబై బ్యాటింగ్‌ను బలోపేతం చేయనున్నారు.

బౌలింగ్ విభాగం ఇలా.. ‌
మిచెల్ సాంట్నర్ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని నడపించనున్నాడు. మిచెల్ సాంట్నర్ ఇప్పటివరకు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. సాంట్నర్ 3 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విని కుమార్ లను చూడవచ్చు.

ముంబై జట్టు ప్లేయింగ్ 11(అంచనా).
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విని కుమార్, రోహిత్ శర్మ(ఇంపాక్ట్ ప్లేయర్).

Story first published: Tuesday, April 22, 2025, 18:53 [IST]
Other articles published on Apr 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+