Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing XI: అగ్నికి వాయువు తోడైంది.. అరవీర భయంకరంగా ముంబై తుదిజట్టు!

ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్‌ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే గత సీజన్‌లోనూ పాయింట్ల పట్టికలో అట్టుడుగున నిలిచిన, అయిదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లతో సహా 23 మంది నాణ్యమైన ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ తమ జట్టును నిర్మించుకుంది. ఈ మెగావేలంలో తమ బ్యాటింగ్-బౌలింగ్‌ను అత్యంత పటిష్టంగా చేసుకుంది. తమ పేస్ దళాన్ని చూస్తే ఏ ప్రత్యర్థి జట్టు అయినా వణికిపోయేలా సిద్ధం చేసింది. రిటైన్ లిస్ట్‌లో ఇప్పటికే గేమ్ ఛేంజర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రాతో పాటు బంతి పంచుకోవడానికి ట్రెంట్ బౌల్డ్, దీపక్ చాహర్‌ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఈ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం ఏ ప్రత్యర్థి జట్టుకు అయినా అత్యంత కఠిన సవాలే.

MI Playing XI Mumbai Indians Unleash a Formidable Squad for IPL 2025

రోహిత్ శర్మ‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యకు తోడుగా విల్ జాక్స్ జట్టులో చేరాడు. దీంతో ముంబై ఇండియన్స్ టాప్-5 బ్యాటింగ్ ఆర్డర్ అరవీర భయంకరంగా మారింది. ఈ వేలంలో ముంబై స్పిన్ బలాన్ని కూడా పెంచుకుంది. కర్ణ్ శర్మ, అఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్‌‌, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్‌ను జట్టులోకి తెచ్చుకుంది. అయితే ముంబై ఇండియన్స్ ఓ అంశం కలవరపెడుతోంది. ఇషాన్ కిషన్ స్థానాన్ని భర్తీ చేసే సమర్థవంతమైన వికెట్ కీపర్‌ను వేలంలో సాధించలేకపోయింది. రాబిన్ మింజ్, ర్యాన్ రికెల్టన్, కృష్ణన్ శ్రీజిత్‌లను సొంతం చేసుకున్నప్పటికీ ఇషాన్ తరహాలో జట్టుకు మద్దతు ఇస్తారా అనేది ప్రశ్న.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 (అంచనా): రోహిత్ శర్మ, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, నమన్ ధిర్, రాబిన్ మింజ్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా గజన్‌ఫర్.

ముంబై ఇండియన్స్
జస్‌ప్రీత్ బుమ్రా (18), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్య(16.35), రోహిత్‌ శర్మ (16.30), బౌల్ట్‌ (12.50), దీపక్‌ చాహర్‌ (9.25), తిలక్‌ వర్మ (8), విల్‌ జాక్స్, నమన్‌ ధీర్‌ (5.25), గజన్‌ఫర్‌ (4.80), శాంట్నర్‌ (2), రికిల్టన్‌ (1), టాప్లీ, లిజాడ్‌ (0.75), రాబిన్‌ (0.65), కర్ణ్‌ శర్మ (0.50), సత్యనారాయణ, రాజ్‌ అంగద్, శ్రీజిత్, అశ్వని కుమార్, అర్జున్‌ తెందుల్కర్, విఘ్నేశ్, బెవాన్‌ (0.30).

Story first published: Tuesday, November 26, 2024, 13:06 [IST]
Other articles published on Nov 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+