Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsRCB : తిలక్ వర్మ రీ ఎంట్రీ.. ఆర్సీబీని ఎదుర్కొనే ముంబై జట్టు ఇదే!

ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్ దశకు చేరుకుంది. అన్ని జట్లు కనీసం పది మ్యాచులు ఆడేశాయి. అయితే ప్లేఆఫ్స్ చేరే చివరి రెండు స్థానాల కోసం చాలా జట్లు పోటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పదేసి పాయింట్లతో ఉండటంతో టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఉన్న రెండు కీలకమైన జట్లు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ కీలకమైన మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. లీగ్ ఆరంభంలో ఈ రెండు జట్లు చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుతమైన ఫామ్ కనబరిచారు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు ముంబై బ్యాటర్లు కూడా ఫామ్ అందుకున్నారు.

MIvsRCB

ఈ మ్యాచ్ గెలిచేందుకు తమ బలమైన ఆటగాళ్లను బరిలో దించాలని ముంబై భావిస్తోంది. వరుసగా విఫలం అవుతున్నా కూడా రోహిత్ శర్మపై ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. అలాగే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మిస్సయిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తిరిగి జట్టులో చేరతాడని తెలుస్తోంది. అంతకుముందు ఆర్సీబీపై కూడా తిలక్ చెలరేగిన సంగతి తెలిసిందే.

కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా ముంబైకి తిలక్ చాలా కీలకం కానున్నాడు. ఇక మిగతా బ్యాటర్లు ఫర్వాలేదు అనిపిస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ముంబై చాలా కష్టాలు పడుతోంది. అర్జున్ టెండూల్కర్ స్థానంలో జట్టులోకి వచ్చిన అర్షద్ ఖాన్ కూడా చెన్నై మ్యాచ్‌లో తేలిపోయాడు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో పీయూష్ చావ్లాకు సరైన సహకారం అందించే బౌలర్ కరువయ్యాడు.

ఈ సమస్యలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కుమార్ కార్తికేయను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే బ్యాటింగ్‌లో కూడా డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టియన్ స్టబ్స్ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌లో స్టబ్స్ ఫెయిల్ అవడంతో బ్రెవిస్‌ను ఆడించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, జోఫ్రా ఆర్చర్, మహమ్మద్ అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మంధ్వాల్

Story first published: Tuesday, May 9, 2023, 9:49 [IST]
Other articles published on May 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+