Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsPBKS : అర్జున్‌కు నో ఛాన్స్.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకునే ముంబై టీం ఇదే!

రాజస్థాన్ రాయల్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత మరో కీలక మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ రెడీ అయింది. ఈ క్రమంలో ముంబై టీంలో ఏవైనా మార్పులు చేస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పక్కన పెట్టిన అర్జున్ టెండూల్కర్ మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలపై కొందరు చర్చిస్తున్నారు.

గత మ్యాచ్‌లో ముంబై రెండు కీలక మార్పులు చేసింది. జేసన్ బెహ్రండాఫ్ స్థానంలో రైలీ మెరెడిత్‌ను ఆడించగా.. అర్జున్ స్థానంలో మహమ్మద్ అర్షద్ ఖాన్‌ను తీసుకుంది. వీరిలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లతో తనకు అవకాశం ఇవ్వడం ఎంత ముఖ్యమైన నిర్ణయమో తెలిసేలా చేశాడు. కానీ మెరెడిత్ పెద్దగా ఆకట్టుకోలేదు.

 Mumbai Indians

మెరెడిత్ ఈ ఏడాది ఆరంభం నుంచే పెద్ద ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో అతనికి మరో అవకాశం ఇస్తారా? లేక బెహ్రండాఫ్‌ను ఆడిస్తారా? అనేది ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు, తాజాగా రిప్లేస్‌మెంట్ కింద తీసుకున్న క్రిస్ జోర్డాన్‌కు కూడా ముంబై అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ విభాగంలో ముంబై ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు.

అవసరం అయితే నేహాల్ వధీరను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే బౌలర్ కావాలని అనుకుంటే కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్‌ ఉండనే ఉన్నారు. బ్యాటర్లలో సూర్యకుమార్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్‌పై మరోసారి ఈ టీం ఆధారపడనుంది. చివరగా పంజాబ్, ముంబై తలపడినప్పుడు ఈ ముగ్గురూ అద్భుతంగా ఆడారు.

కానీ భారీ స్కోరింగ్‌లో చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్‌తో ముంబైని ఓడించాడు. చివరి ఓవర్లో మూడు వికెట్లతో రాణించాడు. అయితే ప్రస్తుతం టిమ్ డేవిడ్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. రాజస్థాన్‌పై చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కూడా బాది ఉన్నాడు. కాబట్టి పంజాబ్ చివరి మ్యాచ్‌లో గెలిచినట్లు గెలవడం కష్టంగా కనిపిస్తోంది.

ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, జోఫ్రా ఆర్చర్, మహమ్మద్ అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, రైలీ మెరెడిత్

Story first published: Wednesday, May 3, 2023, 11:56 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+