Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI Playing 11 Vs GT: ఇషాన్ కిషన్ ఔట్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్ ఇన్.. నేటి తుది జట్లు ఇవే

MI Playing 11 vs GT: Anmolpreet Singh In And Ishan Kishan Out

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నేడు 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. ముంబై గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 5వికెట్ల తేడాతో ఓడించగా, జీటీ ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ఎనిమిది ఓటముల తర్వాత సీజన్‌లో ఆర్ఆర్‌పై గెలిచి తమ గెలుపు ఖాతాను ముంబై మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌ రేసులో లేనందున తదుపరి మ్యాచ్‌ల్లో గెలిచి చివరి స్థానం నుంచి కాస్త బెటర్ పొజిషన్లోకి వెళ్లాలని భావిస్తోంది. ముంబై గత మ్యాచులో బరిలోకి దిగిన ప్లేయింగ్ XIని ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దించాలని చూడొచ్చు. అయితే ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్‌ను తప్పించి అన్ మోల్ ప్రీత్ సింగ్‌ను తీసుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు సమాచారం. తొలి రెండు మ్యాచ్‌లలో తప్పా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇషాన్ ఆడలేదు. దీంతో అతనికి బదులు అన్‌మోల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకుని ప్రయోగించాలనేది ముంబై ప్లాన్. అయితే ఇషాన్ లేకపోతే అతని ఓపెనింగ్ స్థానంలో తిలక్ వర్మ బరిలోకి దిగే వీలుంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనే సక్సెస్ ఫుల్ టీంగా కొనసాగుతుంది. ఈ టీంలో మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారు. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ ఓడిపోవడంతో ఆ టీం విజయాలకు బ్రేక్ పడింది. గుజరాత్ జట్టు సారథి హార్దిక్ పాండ్యా తన మాజీ జట్టుతోనే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. టైటాన్స్ తమ అగ్రస్థానం కొనసాగించేందుకు శాయశక్తుల ప్రయత్నించడానికి రెడీ అయింది.

MI Playing 11 vs GT: Anmolpreet Singh In And Ishan Kishan Out

తుది జట్ల అంచనా
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అన్‌మోల్ ప్రీత్ సింగ్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

Story first published: Friday, May 6, 2022, 8:15 [IST]
Other articles published on May 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+