
లో స్కోర్ మ్యాచ్..
తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశ పరిచింది. రవీంద్ర జడేజా సారథ్యంలో సీఎస్‌కే ఓడిపోయింది. కోల్‌కత నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. లో స్కోర్ మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 131 పరుగులు మాత్రమే చేయగా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్‌కత ఆపసోపాలు పడాల్సి వచ్చింది. 19వ ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. రెండు జట్లలోనూ బౌలర్లు సత్తా చాటారు.

పరుగుల కొరత తీరుతుందా?
గ్రౌండ్‌లో పరుగుల వరద పారుతుందని భావించిన అభిమానులకు నిరాశ పరిచిందీ మ్యాచ్. ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ ఈ కొరతను తీరుస్తుందేమో చూడాలి. మ్యాచ్‌లో దిగకముందే ముంబై ఇండియన్స్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం.. ఆ జట్టును వెంటాడుతోంది. బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసేలా కనిపిస్తోంది. ఇది కొంత వరకు ఆ జట్టు బ్యాటింగ్ శైలిపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

ఎన్సీఏలో
గాయం నుంచి సూర్యకుమార్ యాదవ్ కోలుకోలేకపోవడం వల్ల ఈ మ్యాచ్‌కు అతను దూరం అయ్యాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అతని వేలికి గాయమైంది. ఎముక చిట్లింది. అదింకా వేధిస్తూనే ఉందతన్ని. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటున్నాడు. ఇంకొన్ని వారాల పాటు అతనికి విశ్రాంతి అవసరమౌతుందని ఎన్సీఏ చెబుతోంది. ఇది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఇషాన్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్..
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించనుంది.. ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్. తుది జట్టులోకి అతని చేరిక ఖాయమైనట్టే. ఈ సీజన్‌లో నిర్వహించిన మెగా వేలంపాట సందర్భంగా అత్యధిక ధరను పలికిన ప్లేయర్ ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌కు బ్యాక్‌బోన్‌గా ఉంటోన్నాడు.
అతన్ని వదులుకోవడానికి ఆ ఫ్రాంఛైజీ ఇష్టపడలేదు. భారీ రేటును చెల్లించి మరీ అతన్ని జట్టులోకి తీసుకుంది. ఇషాన్ కిషన్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటోన్నాయి. జట్టు ఓపెనర్‌గా అతను బరిలోకి దిగొచ్చు. తనపై ఉన్న అంచనాలను ఇషాన్ నిలుపుకొంటాడా? లేదా అనేది ఇవ్వాళ్టి మ్యాచ్‌తో తేలిపోతుంది.

ముంబై ఇండియన్ ప్లేయింగ్ 11 అంచనాలు ఇవీ..
తుదిజట్టులో- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్/డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొల్లార్డ్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, ఎం అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రాలకు స్థానం దక్కొచ్చు. ఢిల్లీ కేపిటల్స్‌లో- పృథ్వీ షా, టిమ్ సీఫర్ట్, కేఎస్ భరత్/మన్‌దీప్ సింగ్, రిషభ్ పంత్ (కేప్టన్- వికెట్‌కీపర్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, కమలేష్ నగర్‌కోటి/చేతన్ సకారియా ఆడొచ్చు.


Click it and Unblock the Notifications
