హైదరాబాద్: క్రికెటర్లకు ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌కు వెళ్లకుండా ఉంటాడేమో గానీ, జిమ్‌కు మాత్రం వెళ్లకుండా ఉండడు. అంతేకాదు జిమ్‌కి వెళ్లి తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. అయితే కొందరు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల క్రికెటర్లు జిమ్‌కి వెళ్లడం మానేస్తుంటారు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కి ముందు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు జిమ్ ఎగ్గొట్టినందుకు వెరైటీ శిక్షను అనుభవించారు. ముంబై కీపర్ ఇశాన్ కిషన్ ఒక సెషన్ జిమ్‌కి రానందుకు, అతనితో పాటు అనుకూల్ రాయ్ అసలు ఒక్క రోజు కూడా జిమ్‌లో కనిపించనందుకు వీరికి ఎమోజీ కిట్‌తో ఉన్న దుస్తులు ధరించాలని శిక్ష వేశారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
వీరితో పాటు మరో ఆటగాడు రాహుల్ చాహార్ బస్సులో జీన్స్ ధరించినందుకు ఇదే శిక్ష వేశారు. దీనికి సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోలో తాము జిమ్ సెషన్‌కి వెళ్లనందుకు శిక్ష అనుభవిస్తున్నామని, ఇంకోసారి తప్పు చేయమని ముగ్గురు ఆటగాళ్లు చెప్పారు.