Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్ ఎంఐ న్యూయార్క్‌దే.. ఫైనల్లో మ్యాక్సీ సేన చిత్తు

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఎంఏ న్యూయార్క్ నిలిచింది. ఎంఐ న్యూయార్క్ సోమవారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో ఎం న్యూయార్క్ రెండో సారి మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్సీ) టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఎంఐ న్యూయార్క్ 2023లో మొదటిసారి మేజర్ లీగ్ క్రికెట్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత సంవత్సరం ఈ టైటిల్‌ను వాషింగ్టన్ ఫ్రీడమ్ గెలుచుకుంది.

డల్లాస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మోనాంక్ పటేల్(28), క్వింటన్ డి కాక్(77) 7.1 ఓవర్లలో 72 పరుగులు జోడించారు. మోనాంక్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తజిందర్ ధిల్లాన్ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు, కానీ 14 పరుగులకు మించి చేయలేకపోయాడు. ఇక్కడి నుండి క్వింటన్ డి కాక్ కెప్టెన్ నికోలస్ పూరన్‌తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. పూరన్ 17 బంతుల్లో 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, క్వింటన్ డి కాక్ 46 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు తరఫున లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆయనతో పాటు ఇయాన్ హాలండ్, జాక్ ఎడ్వర్డ్స్, గ్లెన్ మాక్స్‌వెల్, సౌరభ్ నేత్రావాల్కర్ తలో ఒక వికెట్ తీశారు.

MI New York Wins Major League Cricket Title Maxwell s Team Defeated in Final

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి175 పరుగులే చేయగలిగింది. జట్టు మొదటి 5 బంతుల్లోనే తమ ఇద్దరు బ్యాటర్ల వికెట్లను కోల్పోయింది. ఈ సమయానికి ఆ ఇద్దరు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు. ఇక్కడి నుండి రచిన్ రవీంద్ర జాక్ ఎడ్వర్డ్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. ఎడ్వర్డ్స్ 22 బంతుల్లో 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. రచిన్ రవీంద్ర 41 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ జట్టును లక్ష్యం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయాడు. ఫిలిప్స్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు ఉన్నాయి. ఎంఐ న్యూయార్క్ తరఫున ట్రెంట్ బౌల్ట్, రుషిల్ ఉగార్కర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, నోస్టుష్ కెంజిగే ఒక వికెట్ తీశాడు.

Story first published: Monday, July 14, 2025, 10:45 [IST]
Other articles published on Jul 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+