ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎక్కడైనా సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది. జట్టు మొత్తాన్ని కుటుంబంలా చూసుకునే ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు అమెరికాలో కూడా సక్సెస్ అయింది. మేజర్ లీగ్ క్రికెట్‌లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ భరిత విజయం సాధించింది ఎంఐ న్యూయార్క్ టీం. ఈ విజయంతో ఎంఎల్‌సీ ఫైనల్‌లో అడుగు పెట్టింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ జట్టును ఎంఐ బౌలర్లు బాగా కట్టడి చేశారు. దీంతో ఆ టీం కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే (38), మిలింద్ కుమార్ (34) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అయితే ఎంఐ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. టిమ్ డేవిడ్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఇలా ఎంఐ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో టెక్సాస్ టీం సరిగ్గా 20 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు వచ్చిన ఎంఐ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడారు. ఓపెనర్ షాయన్ జహంగీర్ (36) మంచి ఆరంభం అందించాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నికోలసన్ పూరన్ (24) ఫర్వాలేదనిపించాడు. అలాగే యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (33) కూడా రాణించారు. ఇక చివర్లో డేవిడ్ వీస్ (19 నాటౌట్) వేగంగా ఆడటంతో ఎంఐ టీం కేవలం 19 ఓవర్లలోనే 162 పరుగులు చేసి విజయం సాధించింది. టెక్సాస్ బౌలర్లలో డానియల్ శామ్స్, రస్టీ థెరాన్, కాల్విన్ సావేజ్, మహమ్మద్ మొహ్‌సిన్ తలో వికెట్ తీసుకున్నారు.
ఈ విజయంతో ఎంఐ టీం ఎంఎల్‌సీ ఫైనల్ చేరుకుంది. ఈ పిచ్‌పై తాము చేసిన స్కోరు అంత గొప్పది కాదని టెక్సాస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా అంగీకరించాడు. మరి అద్భుతంగా రాణిస్తున్న ఎంఐ తొలి ఎంఎల్‌సీ ట్రోఫీ నెగ్గుతుందేమో చూడాలి. అయితే ఇలా టెక్సాస్ ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.