Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్‌లో ముంబయి సంచలన విజయం.. టైటిల్ నంబర్ 10

టీ20 లీగుల్లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఫైనల్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌పై గెలిచి తన ఖాతాలో 10వ టైటిల్ వేసుకుంది. శనివారం జరిగిన తుదిపోరులో ఎంఐ ఎమిరేట్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (57*; 27 బంతుల్లో), ఆండ్రూ ఫ్లెచర్ (53; 37 బంతుల్లో), ఓపెన్ వసీమ్ (43; 24 బంతుల్లో), కుశాల్ పెరీరా (38; 26 బంతుల్లో) రాణించారు. దుబాయ్ బౌలర్లలో ఒలీ స్టోన్, సికందర్ రజా, జహిర్ ఖాన్ తలో వికెట్ తీశారు.

MI Emirates won in the ILT20 final.. title number 10 for Mumbai

అనంతరం ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు 163 పరుగులే చేసింది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40; 29 బంతుల్లో) టాప్ స్కోరర్. టామ్ బాంటన్ (35; 20 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. ముంబయి ఎమిరేట్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, విజయ్‌కాంత్ చెరో రెండు వికెట్లు, హోస్సేన్, రోహిద్ ఖాన్, వాఖర్ తలో వికెట్ తీశారు.

ఈ టైటిల్‌లో ముంబయి ఇండియన్స్ భారత్, అమెరికా, దుబాయ్ లీగుల్లో టైటిల్ సాధించిన ఫ్రాంచైజీగా అవతరించింది. అయితే ముంబయి ఇండియన్స్ సాధించిన 10 టైటిళ్లలో తొమ్మిదింట్లో పొలార్డ్ భాగస్వామ్యమయ్యాడు. ఇక కెప్టెన్‌గా అత్యధిక టైటిళ్లు అందించింది రోహిత్ శర్మ (6).

2011, 2013 ఛాంపి‌యన్స్ లీగ్‌ల్లో, 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్‌లో, 2023 మేజర్ లీగ్‌ క్రికెట్‌లో, 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో, 2024 ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో విజేత నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఫైనల్ ఓడింది. ఐపీఎల్, సౌతాఫ్రికా లీగ్ టీ20, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తుదిపోరులో ఓడి టైటిల్‌ను కోల్పోయింది.

Story first published: Sunday, February 18, 2024, 11:49 [IST]
Other articles published on Feb 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+