For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూఏఈ ILT20‌లో భీకర ప్లేయర్లతో బరిలోకి ఎంఐ ఎమిరేట్స్.. ఆకాష్ అంబానీ సంతోషం.. జట్టు ఇదే

MI Emirates Announced Team Ahead Of Inagural Season Of UAE ILT20 League

ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20లీగ్‌లో ఓ టీంను కొనుగోలు చేసి ఆ టీంకు ఎంఐ ఎమిరేట్స్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ILT20 ప్రారంభ ఎడిషన్‌ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఇక తొలి ఎడిషన్లో ఎంఐ ఎమిరేట్స్ తరఫున పాల్గొనే ప్లేయర్లను టీం మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఎంఐ ఎమిరేట్స్ టీంలో కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవో, నికోలస్ పూరన్ లాంటి దిగ్గజ వెస్టిండీస్ స్టార్లతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్, దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లాంటి మ్యాచ్ మలుపు తిప్పే బౌలర్లు కూడా ఉన్నారు. అలాగే ఇటీవల ది హండ్రెడ్ లీగ్‌లో తొలి సెంచరీని సాధించిన ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ స్మీడ్ కూడా టీంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ వెబ్‌సైట్‌‌లో టీం ప్లేయర్ల లిస్టును ప్రకటించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన కొందరు ప్లేయర్లతో మరికొందరు కొత్త స్టార్లు ఎంఐ ఎమిరేట్స్ జట్టులో చేరారు.

 అబుదాబి బేస్డ్‌గా ఎంఐ ఎమిరేట్స్

అబుదాబి బేస్డ్‌గా ఎంఐ ఎమిరేట్స్

ఎంఐ తన ప్రకటనలో.. 'MI ఎమిరేట్స్ UAEలో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ T20 ప్రారంభ ఎడిషన్‌కు జట్టును ప్రకటిస్తోంది. ఈ జట్టు అబుదాబి బేస్డ్‌గా ఉంటుంది. టీంలో కొందరు ప్రస్తుత మరియు గత ముంబై ఆటగాళ్లు అలాగే కొందరు కొత్త ఆటగాళ్లు ఉన్నారు. కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్ ప్రారంభ ఎడిషన్‌కు ముందు ఎంఐ ఎమిరేట్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఐ యొక్క ఐకానిక్ బ్లూ మరియు గోల్డ్‌ జెర్సీలో తమ మెరుపులు త్వరలోనే చూపించబోతున్నారు' అని పేర్కొంది.

ఎంఐ ఎమిరేట్స్ తరఫున ఆడే ఆటగాళ్ల పూర్తి జాబితా:

ఎంఐ ఎమిరేట్స్ తరఫున ఆడే ఆటగాళ్ల పూర్తి జాబితా:

కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, ఆండ్రీ ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ స్మీడ్, జోర్డాన్ థాంప్సన్, నజీబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫజల్హాక్ ఫరూకీ, బ్రాడ్లీ వీల్, బాస్ డి లీడే.

 పొలార్డ్‌ జట్టులో ఉండడం ఆనందాన్నిస్తోంది

పొలార్డ్‌ జట్టులో ఉండడం ఆనందాన్నిస్తోంది

రిలయన్స్ జియో మరియు ఎంఐ ఎమిరేట్స్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ 14మంది ఆటగాళ్లను జట్టులో తీసుకోవడం పట్ల తన సంతోషం వ్యక్తం చేశాడు. పొలార్డ్‌ ముంబై జట్టులో ఓ కీలక ప్లేయర్ అని ప్రశంసించాడు. పొలార్డ్ సేవలను ఎంఐ ఎమిరేట్స్‌లో నిలుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. MI ఎమిరేట్స్‌ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ సాదర స్వాగతం చెబుతున్నట్లు తెలిపాడు. అనుభవమున్న ప్లేయర్లను, యువ ప్రతిభావంతులను ఒకే చోట చేర్చి జట్టుకు సమతూకం తెచ్చేలా పెట్టుబడి పెట్టడం ఎంఐ పద్ధతి అని తెలిపాడు. ఎంఐ తరహాలో ఎంఐ ఎమిరేట్స్ కూడా ఆడుతుందని ఆశిస్తున్నాం అని ఆకాష్ పేర్కొన్నాడు.

Story first published: Friday, August 12, 2022, 16:47 [IST]
Other articles published on Aug 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+