For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘#మీటూ’ ఉద్యమం: లంక పేసర్ లసిత్ మలింగ కూడా అసభ్యంగా..

#Meetoo : Chinmayi Sripaada Tweets About Lasith Malinga
#MeToo movement: After Arjuna Ranatunga, Lasith Malinga accused of sexual assault

హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా 'మీటూ' ఉద్యమం సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. బుధవారం ఓ ఎయిర్‌హోస్టెస్‌ శ్రీలంక మాజీ క్రికెటర్‌, కెప్టెన్‌ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీలంకకు చెందిన మరో క్రికెటర్ లసిత్ మలింగపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. #మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఓ బాధితురాలు మలింగా బాగోతాన్ని బయటపెట్టింది.

ఇప్పుడు, ఆ విషయాన్ని టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసింది. ఇంతకీ చిన్మయి శ్రీపాదకు ఆ బాధితులు ఏం చెప్పారంటే...

"కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో నాకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగా రూమ్‌లో ఉందని చెప్పారు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు.

"మలింగా మాత్రం నన్ను బెడ్‌పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూమ్‌కు వెళ్లి నా ముఖాన్ని కడుక్కున్నాను.

"హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూమ్ నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూమ్‌కు వెళ్లావని, అదికాక అతనో క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తెలిపారు" అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్ళబోసుకుంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని చిన్మయి తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

ఇక, అర్జున రణతుంగ విషయానికి వస్తే

"ముంబైలోని హోటల్‌ జూహు సెంటర్‌ ఎలివేటర్‌లో భారత, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్‌ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను కనిపించలేదు.

అదే సమయంలో హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా అతడిని విష్‌ చేశాను. కానీ అంతలోనే నాకు అతి సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టా.

నీ పాస్‌పోర్టు క్యాన్సిల్‌ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్‌ రిసెప్షన్‌లో కంప్లైంట్‌ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్‌ మ్యాటర్‌. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు" అంటూ అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును ఓ భారత ఎయిర్‌హోస్టెస్‌ బహిర్గతం చేసింది.

Story first published: Thursday, October 11, 2018, 16:15 [IST]
Other articles published on Oct 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+