For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'#మీటూ' ఉద్యమం: గొంతెత్తిన మిథాలీ రాజ్, లైంగిక బాధితులకు మద్దతు

MeToo in India: Mithali Raj supports victims of sexual harassment, says important to speak without fear of prejudice

హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదలెట్టిన ఈ రచ్చ, ఇప్పుడు కేవలం సినిమా రంగానికి పరిమితం కాకుండా మీడియా, రాజకీయ రంగాల నుంచి క్రికెట్ దాకా వ్యాపించింది. సాక్ష్యాత్తూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై కూడా '#మీటూ' ఆరోపణలు వచ్చాయి.

ఇక, శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ, సీనియర్ పేసర్ లసిత్ మలింగాల ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధిత మహిళలు వాటి గురించి వెల్లడించారు. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాల గుప్తా కూడా '#మీటూ' అంటూ తాను ఎదుర్కొన్న మానసిక వేధింపుల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.

 ‘#మీటూ’ పేరుతో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను

‘#మీటూ’ పేరుతో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను

‘#మీటూ' పేరుతో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా వెల్లడించడానికి ఒక్కొక్కరుగా ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఇలా నిర్భయంగా బయటికొచ్చి తమ అనుభవాలను పంచుకుంటున్న వారికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన మద్దతుని తెలియజేసింది. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ కూడా చేరింది.

'#మీటూ' ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా

'#మీటూ' ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా

ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ "'#మీటూ' ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా. పనిచేసే చోట భద్రత కోరుకోవడం మహిళల హక్కు. దేనికైనా అంగీకారం అనేది చాలా ముఖ్యం. దాన్ని చాలామంది ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇష్టం లేకుండా చెయ్యివేసినా పర్లేదులే... అనుకుంటారు. ఇలా లైంగికంగా ఎవరైనా వేధింపులు ఎదుర్కొంటే... వాళ్లు కచ్ఛితంగా పోరాటం చేయాలి" అని అన్నారు.

వాళ్లు ఎదుర్కొన ఇబ్బందులు నిజమైతే

వాళ్లు ఎదుర్కొన ఇబ్బందులు నిజమైతే

"ఎదుటివారు ఏమనుకుంటారో అనే దానితో సంబంధం లేకుండా ప్రతిఘటించాలి. అలా పోరాటం చేసేవాళ్లు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు ఎదుర్కొన ఇబ్బందులు నిజమైతే, చివరికి వారికే విజయం దక్కి తీరుతుంది. ఆత్మాభిమానం, హుందాతనం ఉన్న మహిళలకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. నిక్కచ్చిగా ఉండండి, ధైర్యంగా మాట్లాడండి" అంటూ మిథాలీ మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

 నటులు, రచయితలు కూడా ఉండడం బాధకరం

నటులు, రచయితలు కూడా ఉండడం బాధకరం

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన నటులు, రచయితలు కూడా ఉండడం బాధకరమని మిథాలీరాజ్ అన్నారు. ఇక, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, అర్జున అవార్డులను సైతం గెలుచుకుంది.

లంక పేసర్ లసిత్ మలింగపై ఓ బాధితురాలు

#మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఓ బాధితురాలు మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పుడు, ఆ విషయాన్ని టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసింది. "కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో నాకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగా రూమ్‌లో ఉందని చెప్పారు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు.

"మలింగా మాత్రం నన్ను బెడ్‌పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూమ్‌కు వెళ్లి నా ముఖాన్ని కడుక్కున్నాను.

"హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూమ్ నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూమ్‌కు వెళ్లావని, అదికాక అతనో క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తెలిపారు" అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్ళబోసుకుంది.

 అర్జున రణతుంగ విషయానికి వస్తే

అర్జున రణతుంగ విషయానికి వస్తే

"ముంబైలోని హోటల్‌ జూహు సెంటర్‌ ఎలివేటర్‌లో భారత, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్‌ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను కనిపించలేదు.

అదే సమయంలో హోటల్‌ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా అతడిని విష్‌ చేశాను. కానీ అంతలోనే నాకు అతి సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టా.

నీ పాస్‌పోర్టు క్యాన్సిల్‌ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్‌ రిసెప్షన్‌లో కంప్లైంట్‌ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్‌ మ్యాటర్‌. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు" అంటూ అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును ఓ భారత ఎయిర్‌హోస్టెస్‌ బహిర్గతం చేసింది.

Story first published: Tuesday, October 16, 2018, 12:00 [IST]
Other articles published on Oct 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+