మరిన్ని చిక్కుల్లో పడ్డ బీసీసీఐ బాస్: ఐసీసీ మీటింగ్ నుంచి పేరు తప్పించారు

హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అక్టోబర్ 16 నుంచి 19 వరకు సింగపూర్ వేదికగా జరగనున్న ఐసీసీ సమావేశం నుంచి రాహుల్ జోహ్రీ పేరుని తప్పించారు. తనపై వస్తోన్న ఆరోపణలకు సమాధానం ఇచ్చిన తర్వాతే బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనాలని బీసీసీఐ పాలకుల కమిటీ రాహుల్‌ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే?
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ తనను లైంగిక వేధింపులకు గురి చేశాండంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలతో పాటు స్క్రీన్ షాట్లను జత చేస్తూ 'రాహుల్ జోహ్రి... నీ సమయం ముగిసింది' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్ జోహ్రీని వివరణ కోరిన సీఓఏ
ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) రాహుల్ జోహ్రీ వివరణ ఇవ్వాలని కోరింది. ఆయన వారం రోజులు గడువు అడిగారని, సమాధానం వచ్చాక తదుపరి చర్యలపై ఆలోచిస్తామని సీఓఏ పేర్కొంది. తాజాగా దీనిపై బోర్డు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడారు.

వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన్ను కోరాం
"రాహుల్‌పై వస్తోన్న ఆరోపణల దృష్ట్యా ఐసీసీ మీటింగ్‌లో భాగం కానివ్వడం లేదు. వివరణపై దృష్టి పెట్టాల్సిందిగా ఆయనను కోరాం. ఆయన ఇచ్చే సమాధానం బట్టి చర్యలుంటాయి. ఏదైనా తప్పున్నట్లు తేలితే కచ్చితంగా అతడిపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సీఈఓ పదవి నుంచి కూడా తప్పిస్తాం. అప్పటి వరకూ బోర్డు కార్యాలయానికి కూడా రావొద్దని చెప్పాం" అని అన్నారు.

డిస్కవరీ చానెల్‌లో పని చేస్తున్నప్పుడు
రాహుల్ జోహ్రీ 2001 నుంచి 2016 మధ్య డిస్కవరీ చానెల్‌లో పని చేస్తున్నప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ మాజీ సహోద్యోగిని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్‌కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దానిని అతను అవకాశంగా తీసుకున్నాడని ఆరోపించింది.

తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు
తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జోహ్రి 2016లో బీసీసీఐ సీఈఓగా నియమితుడయ్యాడు. బీసీసీఐలో చేరకముందు ఆయన డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్‌కు జనరల్ మేనేజర్, ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అయితే రెండు మూడు రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై రాహుల్ జోహ్రీ ఇంతవరకూ స్పందించక పోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications