Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Merry Christmas: క్రిస్‌మస్ వేడుకల్లో భారత క్రికెటర్లు ఇలా (ట్వీట్స్)

Merry Christmas: Indian cricket stars spread Christmas cheer in Australia

హైదరాబాద్: క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న 'క్రిస్‌మస్' వస్తుందంటే చాలు. క్రైస్తవుల ఇళ్లలో నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకలో భాగస్వాములు అవుతారు. మంగళవారం ప్రపంచవ్యాప్తంగా క్రిస్‌మస్ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు.

భారత్‌కు చెందిన పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం ఈ క్రిస్‌మస్ వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందులో 'మేరీ క్రిస్‌మస్' అంటూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

బీసీసీఐ

బీసీసీఐ

భారత క్రికెటర్లు అందరూ కలిస సెల్ఫీ దిగిన ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసి క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపింది.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాక్లెట్స్, క్రిస్‌మస్ కేక్‌ను చేత పట్టుకుని అభిమానులకు క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలిపాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ క్రిస్మస్ ట్రీ దగ్గర నిల్చున్న ఫోటోను పోస్ట్ చేసి క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలిపాడు.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

భారత మాజీ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్‌లో ఫోటో ఎడిటర్ వాడి అభిమానులకు క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలిపాడు.

మానికా బాత్రా

మానికా బాత్రా

భారత టెబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ చర్చి వేడుకలకు సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

సానియా మిర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రిస‌మస్ శుభాకాంక్షలు చెబుతూ... తన ఇంట్లో అలకరించిన క్రిస్ మస్ ట్రీని అభిమానులతో పంచుకుంది.

సురేశ్ రైనా

సురేశ్ రైనా

టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలుపుతూ... తన ఇంట్లో అలకరించిన క్రిస్ మస్ ట్రీని అభిమానులతో పంచుకున్నాడు. చిత్రంలో రైనా భార్యతో పాటు కుమార్తె గ్రేసియాను కూడా మీరు చూడొచ్చు.

కిదాంబి శ్రీకాంత్

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, సాంటా క్లాజ్‌తో దిగిన ఫోటోను పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలిపాడు.

శిఖర్ ధావన్

క్రిస్ మస్ ట్రీ వద్ద తన భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ అభిమానులకు క్రిస‌మస్ శుభాకాంక్షలు తెలిపాడు.

పీవీ సింధు

పీవీ సింధు

బేబీ శాంటాను ఎత్తుకున్న ఫోటోను పోస్టు చేస్తూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అభిమానులకు క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలిపింది.

Story first published: Tuesday, December 25, 2018, 19:24 [IST]
Other articles published on Dec 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+