Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మానసిక ఆరోగ్యం ఒక సవాల్, సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం: రాహుల్ ద్రవిడ్

Rahul Dravid Says Mental health Is A Big Challenge For Cricketers || Oneindia Telugu
Mental health a challenge, important to maintain balance: Rahul Dravid

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో మెంటల్ హెల్త్ కాపాడుకోవడం అతిపెద్ద సవాల్ అని టీమిండియా మాజీ కెప్టెన్‌, ఎన్‌సీఏ చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. బిజీ షెడ్యూల్, భవిష్యత్తుపై అనిశ్చితితో వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతితీ సమతూకంగా ఉంచుకోవాలని క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ సూచించాడు.

క్రికెటర్ల మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ద్రవిడ్ తెలిపారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ "మానసిక ఆరోగ్యం ఓ పెద్ద సవాల్‌. క్రికెట్‌ కఠినమైన ఆట. తీవ్రమైన పోటీ, ఒత్తిడీ ఉంటాయి. ఆటగాళ్లు ఏడాది పొడవునా ఆడుతూనే ఉంటారు" అని అన్నాడు.

ఒత్తిడిని అధిమించేందుకు

ఒత్తిడిని అధిమించేందుకు

"కొన్ని రోజులు ఆడిన తర్వాత ఎక్కువ కాలం ఎదురుచూస్తూ, ఆలోచిస్తూ గడపాలి. మైదానంలో, బయటా ఒత్తిడిని అధిమించేందుకు నిన్ను నువ్వే కాపాడుకోవాలి. మానసిక ఆరోగ్యాన్నీ రక్షించుకోవాలి. ఈ విషయంపైనే కుర్రాళ్లతో మనం ఎక్కువగా మాట్లాడాలి. చేసే ప్రతి పనిలో సరైన స్థాయిలో సమతూకం అవసరం" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా అలాంటి వ్యవస్థను నెలకొల్పేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా ఎన్‌సీఏలో ఒక మానసిక నిపుణుడు ఉండాలన్న నిర్ణయానికి వచ్చామని తెలిపాడు. ఎందుకంటే అలాంటి సమస్యలను నిపుణులైతేనే సమర్థవంతంగా నయం చేయగలని ద్రవిడ్ పేర్కొన్నాడు.

మానసిక సమస్యల కారణంగా

మానసిక సమస్యల కారణంగా

కాగా, మానసిక సమస్యల కారణంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్ మాట్లాడుతూ "మానసికంగా మ్యాక్స్‌వెల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగా కొంత కాలం పాటు క్రికెట్‌కు అతను దూరమవుతున్నాడు" అని తెలిపాడు.

మ్యాక్స్‌వెల్‌కు బాసటగా నిలిచిన కోహ్లీ

మ్యాక్స్‌వెల్‌కు బాసటగా నిలిచిన కోహ్లీ

ఇలా మానసిక సమస్యల కారణంగా మ్యాక్స్‌వెల్ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించడాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం సమర్ధించాడు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందున క్రికెట్‌కు విరామం ప్రకటించిన మ్యాక్స్‌ వెల్‌ నిర్ణయం అసాధారనమైదని ప్రశంసించాడు. అలా చెప్పడానికి, విరామం నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని కోహ్లీ పేర్కొన్నాడు.

Story first published: Saturday, November 30, 2019, 9:49 [IST]
Other articles published on Nov 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+