బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభం అయింది. మొదటి రోజు ఆట ఉత్కంఠభరితంగా జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ పటిష్టంగా ప్రారంభమైంది. ఓపెనర్లు దాటిగా ఆడారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 68 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
మొదటి మ్యాచ్ ఆడుతున్న సామ్ కొన్ స్టాస్ 60 పరుగులు చేయగా.. ఖవాజా 57 పరుగులు, లబ్ షంగే 72 పరుగులు చేశారు. అయితే మొదటి రోజు ఆటను అరగంట పాటు పొడిగించారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. నిర్ణీత 90 ఓవర్లు వేయాల్సి ఉండగా వేయలేదు. దీంతో 90 ఓవర్లు పూర్తి చేయడానికి అదనంగా 30 నిమిషాలు పొడిగించారు. 90 ఓవర్లు సమయానికి పూర్తి కానప్పుడు ఇది ప్రామాణిక పద్ధతి అని చెబుతున్నారు.

వర్షం లేదా ఏదైనా ఇతర అంతరాయాలు ఏర్పడినప్పుడు కూడా మ్యాచ్ సమయాన్ని పొడిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నాలుగో టెస్ట్
మొదటి సెషన్ ఉదయం 5:00 గంటలకు ప్రారంభమై 7 గంటల వరకు కొనసాగుతోంది. 7 గంటల నుంచి 7:40 భోజన సమయం ఉంటుంది. రెండవ సెషన్ 7:40 గంటల నుంచి 9:40 వరకు ఉంటుంది. 9:40 నుంచి 10 గంటల వరకు టీ బ్రేక్ ఉంటుంది. మూడో సెషన్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతుంది.
కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విషయం చర్చనీయాంశంగా మారింది. అతని ప్రవర్తనకు అందరు నిషేధం విధిస్తారని భావించారు. కానీ మ్యాచ్ ఫీజ్ లో 20 శాతం కోత విధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్ కోహ్లీ డ్యాష్ ఇవ్వడం పై విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ కావాలనే సామ్ కోన్‌స్టాస్‌ను ఢీ కొట్టాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆరోపించారు. కోహ్లీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు.