
కాయిన్ బదులు బ్యాట్
లీగ్‌లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సాధారణంగా మ్యాచులో ఎవరు ముందు బ్యాటింగ్ చేయాలో నిర్ణయించేందుకు కాయిన్‌తో టాస్ వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బ్యాటు ఫ్లిప్ ద్వారా డిసైడ్ చేసారు. రెండు జట్ల కెప్టెన్‌లు గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ మైదానంలో ఉండగా.. ఓ కుర్రాడు బ్యాటును పైకి విసిరాడు. అది తిరుగుతూ వచ్చి నేలపై బోర్లా పడింది. బ్యాట్ ఫ్లిప్ గెలిచిన స్టార్స్ కెప్టెన్ మాక్స్‌వెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

గతంలో జింగ్స్ స్టంప్స్
గతంలో కూడా బీబీఎల్ వినూత్న ప్రయోగాలు చేసింది. బంతి తాకగానే వెలుతురు వచ్చేలా ఎల్ఈడీ వికెట్ల (జింగ్స్ స్టంప్స్)ను క్రికెట్‌కు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ ఈ స్టంప్స్‌ను వాడుతున్నారు. ఈ స్టంప్స్‌తో బంతి వికెట్లను తాకిందో లేదో స్పష్టంగా తెలుస్తోంది. మరి బీబీఎల్ గతంలో కూడా బ్యాట్ ఫ్లిప్‌ను ప్రయోగించింది.

స్టార్స్ విజయం
మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసింది. షాన్ మార్ష్ (43) టాప్ స్కోరర్. నేపాల్ కుర్రాడు సందీప్ లామిచాన్ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన మెల్‌బోర్న్ స్టార్స్‌లో మార్కస్ స్టొయినిస్ (68*), మాక్స్‌వెల్ (40*) అజేయంగా నిలవడంతో.. మరో 7 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
లిన్, మాక్స్‌వెల్ సాయం
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రగిలిన విషయం తెలిసిందే. 11 మంది మృతిచెందగా.. 28 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు లిన్, మాక్స్‌వెల్, షార్ట్ ముందుకొచ్చాడు. ఇక నుంచి బిగ్‌బాష్‌లో తాము కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్ సొసైటీకి 250 డాలర్లు విరాళం అందజేస్తానని ప్రకటించారు. ఈ మ్యాచులోనూ మాక్స్‌వెల్ ఓ సిక్సర్ బాదేశాడు.


Click it and Unblock the Notifications












