For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేతో పాటు సిరీస్ ఆసిస్‌దే: డివిల్లియర్స్ రికార్డ్ కోహ్లీ బద్దలు

By Srinivas

మెల్బోర్న్: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసిస్ 3 వికెట్ల తేడాతో టీమిండియా పైన గెలిచింది. ఈ గెలుపుతో ఆసిస్ సిరీస్ కూడా గెలుచుకుంది. మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఆసిస్ సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ వరుసగా మూడు వన్డేలు ఓడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసిస్ 7 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. తద్వారా వన్డేతో పాటు సిరీస్ గెలుచుకుంది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్

- 296 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. 48.5 ఓవర్లలో ఆసిస్ 296 పరుగులు చేసింది.

- ఆసిస్ ఆరో వికెట్ వాడే (6) రూపంలో 215 పరుగుల వద్ద కోల్పోయింది. ఏడో వికెట్ 295 పరుగుల వద్ద మాక్స్‌వెల్ (96) రూపంలో కోల్పోయింది. మన బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ 2, జడెజా 2 వికెట్లు తీశారు.

- జట్టు స్కోర్ 204 ఉన్నప్పుడు ఎంఆర్ మార్ష్ (17) అవుటయ్యాడు. 35.1 ఓవర్లకు ఆసిస్ 204 పరుగులు చేసింది. అయిదు వికెట్లు కోల్పోయింది.

- 167 పరుగుల వద్ద మార్ష్ (62) అవుటయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగులో ధోనీ క్యాచ్ పట్టాడు. 34 ఓవర్లు ముగిసేసరికి ఆసిస్ 202 పరుగులు చేసింది.

- ఆసిస్ జట్టు పరుగులు 150 ఉన్నప్పుడు బెయిలీ అవుటయ్యాడు. జడెజా బౌలింగులో బెయిలీ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. బెయిలీ 21 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

- 22 ఓవర్లు ముగిసేసరికి ఆసిస్ 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. మార్ష్ అర్ధ సెంచరీ (52) పూర్తి చేశాడు.

- 112 పరుగుల వద్ద స్మిత్ (51) పెవిలియన్ చేరాడు. జడెజా బౌలింగులో రహానే క్యాచ్ పట్టాడు. మార్ష్ (48), బెయిలీ (4) క్రీజులో ఉన్నారు.

- 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్.. దూకుడు ప్రదర్శిస్తోంది. 48 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ (21) అవుటయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

 Melbourne ODI: Virat Kohli breaks AB de Villiers' record

భారత్ ఇన్నింగ్స్:

- భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 296 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రిచర్డ్‌సన్ 1, హేస్టింగ్స్ 4, ఫాల్కనర్ 1 వికెట్ తీశారు. రోహిత్ 6, ధావన్ 68, కోహ్లీ 117, రహానే 50, ధోనీ 23, గుర్ కీరత్ 8, జడెజా 6, రిషీ ధావన్ 3 పరుగులు చేశారు.

- భారత్ స్కోర్ 274 ఉన్నప్పుడు గుర్ కీరత్ సింగ్ అవుటయ్యాడు. అతను 7 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఫాల్కనర్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత హేస్టింగ్ బౌలింగులో ధోనీ అవుటయ్యాడు. ధోనీ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23 పరుగులు చేశాడు. ధోనీ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ధోనీ అవుటయ్యే సమయానికి భారత్ స్కోర్ 6 వికెట్లకు 288 పరుగులు. 49 ఓవర్లు పూర్తయ్యాయి.

- 47వ ఓవర్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హేస్టింగ్స్ బౌలింగులో కోహ్లీ బెయిలీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ 117 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.

- 44.2 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. కోహ్లీ 110 బంతుల్లో 109 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు.

- భారత్ స్కోర్ 243 పరుగులు ఉన్నప్పుడు మూడో వికెట్ కోల్పోయింది. రహానే 55 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు, ఒక సిక్స్) చేసి అవుటయ్యాడు. హేస్టింగ్స్ బౌలింగులో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- విరాట్ కోహ్లీ సంచరీ చేశాడు. 105 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో కోహ్లీ సెంచరీ చేశాడు.

- 31 ఓవర్లకు భారత్ స్కోర్ 2 వికెట్లు కోల్పోయి 154పరుగులు. రహానే, కోహ్లీ క్రీజులో ఉన్నారు.

- భారత్ స్కోర్ 134 వద్ద ఉన్నప్పుడు శిఖర్ ధావన్ అవుటయ్యాడు. ధావన్ 91 బంతుల్లో 9 ఫోర్లతో 68 పరుగులు చేశాడు.

- 15 పరుగుల వద్ద భారత్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ 6 పరుగులు చేసి రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. శిఖర్ ధావన్‌, విరాట్‌ కోహ్లీ క్రీజులో ఉన్నారు. తొలి రెండు వన్డేలలో రోహిత్ శర్మ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసిస్

- భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఆదివారం ఉదయం ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో ఓడిన భారత్‌ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ గెలవడం తప్పనిసరి. దీంతో వన్డేలో కూడా బ్యాట్స్‌మెన్‌పైనే భారం పడింది.

డివిల్లియర్స్ రికార్డ్ కోహ్లీ బద్దలు

భారత్ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్ రికార్డ్ బద్దలు కొట్టాడు. మెల్బోర్న్‌లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7,000 పరుగులు పూర్తి చేశాడు. 161 ఇన్నింగ్స్, 169 మ్యాచులలో కోహ్లీ ఈ రికార్డ్ సృష్టించాడు.

అంతకుముందు ఈ రికార్డ్ డివిల్లియర్స్ పేరిట ఉంది. ఇతను 166 ఇన్నింగ్సులలో 7,000 పరుగులు పూర్తి చేశాడు. కోహ్లీ ఇప్పుడు అతని కంటే ఐదు ఇన్నింగ్స్ ముందే ఆ రికార్డ్ చేరువయ్యాడు. మూడో వన్డేలో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ 7,000 పరుగుల మార్క్ చేరాడు.

వన్డేలలో ఫాస్టెస్ట్ 7,000

విరాట్ కోహ్లీ (భారత్) - 161 ఇన్నింగ్స్ (2016)
ఏబీ డివిల్లీయర్స్ (దక్షిణాఫ్రికా) - 166 ఇన్నింగ్స్ (2014)
సౌరవ్ గంగూలీ (భారత్) - 174 ఇన్నింగ్స్ (2001)
బ్రయాన్ లారా(వెస్టిండీస్) - 183 ఇన్నింగ్స్ (2001)
డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్) - 187 ఇన్నింగ్స్ (1991)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+