న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త స్పిన్‌ సంచలనం: ఎవరీ మెహది హసన్‌

By Nageshwara Rao

హైదరాబాద్: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ ఓ అరుదైన ఘట్టాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ తొలిసారిగా ఇంగ్లాండ్‌ జట్టుని ఓడించింది. అయితే ఈ విజయం వెనుక 19 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాడు కీలకపాత్ర పోషించాడు. అతడి పేరు మెహదీ హసన్‌ మిరాజ్‌. బంగ్లాదేశ్‌ కొత్త స్పిన్‌ సంచలనం.

లైన్‌ తప్పని బౌలింగ్‌‌తో పాటు సంప్రదాయబద్ధమైన ఆఫ్‌ స్పిన్‌కు వైవిధ్యాన్ని జోడిస్తూ బంతులు విసరడం మెహదీ హసన్‌ ప్రత్యేకత. మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెహదీ హసన్‌ ఆడిన రెండు టెస్టుల్లో 19 వికెట్లు తీసుకున్నాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంగ్లాండ్ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో చోటు దక్కించుకున్న మెహదీ హసన్‌ తొలి టెస్టు సిరిస్‌లో ఆకట్టుకున్నాడు. బంగ్లా పేసర్లకు బంతిని ఇవ్వకుండా రెండో ఓవర్లోనే తనకు కొత్త బంతిని ఇచ్చిన కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆఫ్‌ స్పిన్‌తో ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

Mehedi Hasan Miraz The Brightest Young Star of Bangladesh Cricket

చిట్టగ్యాంగ్‌లో జరిగిన తొలి టెస్టులో 80 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. మిర్పూర్ లో 100 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా చేజార్చుకోని ఇంగ్లాండ్ ఆ తర్వాత మెహదీ హసన్‌ దెబ్బకు విలవిలలాడింది.

తొలిసారి ఇంగ్లాండ్ ఓటమి: చరిత్ర సృష్టించిన బంగ్లా

ఆ తర్వాత 64 పరుగులు సాధించి ఆలౌటైంది. మ్యాచ్ మూడో రోజైన శనివారం 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 164 పరుగులకే ఆలౌట్ అయింది. 2016 అండర్‌-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌ సెమీ ఫైనల్‌‌కు చేరడంలో కూడా మెహదీ హసన్‌ కీలకపాత్ర పోషించాడు. కేవలం బౌలర్‌గానే కాదు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కూడా సత్తా చాటాడు.

2014 వరల్డ్ కప్‌లోనూ అతను బంగ్లాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెరీర్‌ను బ్యాట్స్‌మన్‌గా మొదలుపెట్టినప్పటికీ, మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ షేక్‌ సలావుద్దీన్‌ స్ఫూర్తితో ఆఫ్‌స్పిన్నర్‌గా మారాడు. అండర్‌ 19 వరల్డ్ కప్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన మెహదీ హసన్‌ 12 వికెట్లు తీయడంతో పాటు 242 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచాడు.

తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మెహదీ హసన్‌ ఏకంగా 28 స్థానాలు ఎగబాకి 33వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 7 వికెట్లు తీసుకుని ర్యాంకింగ్స్‌లో అడుగుపెట్టిన మెహదీ హసన్‌ రెండో టెస్టులో 12 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X