న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు: ప్రపంచ రికార్డు బద్దలు

Meg Lanning Breaks Her Own T20 International Record || Oneindia Telugu
Meg Lanning breaks world record as Australia humble England

హైదరాబాద్: మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో లానింగ్‌ 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 బంతుల్లోనే అజేయంగా 133 పరుగులతో రికార్డు సెంచరీ చేసింది.

తద్వారా మహిళల టీ20ల్లో తనపేరిటే ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును లానింగ్‌ అధిగమించింది. గతంలో మెగ్ లానింగ్‌ 126 పరుగులు సాధించి అత్యధిక పరుగుల రికార్డును నమోదు చేశారు. లానింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 93 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (54) హాఫ్ సెంచరీ చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 రన్స్‌కే పరిమితమైంది. కాగా, టీ20 సిరిస్‌కు ముందు మహిళల యాషెస్‌ ట్రోఫీని ఆస్ట్రేలియా నెగ్గిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, July 28, 2019, 11:14 [IST]
Other articles published on Jul 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X