Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆమ్లా రికార్డు బద్దలు: చరిత్ర సృష్టించిన మెగ్ లానింగ్

Meg Lanning becomes fastest crickter to reach 13 ODI hundreds

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 13 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. గురువారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ సెంచరీతో ఆస్ట్రేలియా 178 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. వన్డేల్లో వెస్టిండిస్‌పై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా, వన్డేల్లో మెగ్ లానింగ్‌కు ఇది 13వ సెంచరీ.

మెగ్ లానింగ్ అరుదైన ఘనత

మెగ్ లానింగ్ అరుదైన ఘనత

దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా మెగ్ లానింగ్ అరుదైన ఘనత సాధించారు. కేవలం 76 ఇన్నింగ్స్‌ల్లోనే మెగ్ లానింగ్ 13వ వన్డే సెంచరీ సాధించింది. ఈ క్రమంలో గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 83 ఇన్నింగ్స్‌లో 13 సెంచరీలతో నమోదు చేసిన రికార్డుని ఇప్పుడు మెగ్ లానింగ్ బద్దలు కొట్టింది.

అలైసా హీలే సైతం సెంచరీ

అలైసా హీలే సైతం సెంచరీ

ఈ మ్యాచ్‌లో మెగ్‌ లానింగ్‌ సెంచరీకి తోడు అలైసా హీలే(122) సెంచరీతో సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. అలైసా హీలే 95 బంతుల్లోనే సెంచరీ సాధించింది. సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడే క్రమంలో 39వ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరింది. అనంతరం 309 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు 178 పరుగుల తేడాతో ఓడిపోయింది.

8 పరుగులకే 3 వికెట్లు

8 పరుగులకే 3 వికెట్లు

మొదటి రెండు ఓవర్లలోనే వెస్టిండిస్ జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో 37.3 ఓవర్లలో విండీస్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి ఆలౌటైంది. ఇదిలా ఉంటే, మహిళల టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా లానింగ్‌ పేరిటే ఉంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో లానింగ్‌ 133 పరుగులు చేశారు.

Story first published: Friday, September 6, 2019, 13:17 [IST]
Other articles published on Sep 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+