కోహ్లీపై పిచ్చి ప్రేమ.. ఒంటిపై 16 ట్యాటూలు!!

కటక్: టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కింగ్' కోహ్లీ ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. మరోవైపు తన దూకుడైన నాయకత్వంతో ఆకట్టుకుంటున్నాడు. కోహ్లీ ఆటకు ఎంతో మంది దిగ్గజ క్రికెట్ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు. ఇక భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి భారీగా అభిమానులు ఉన్నారు.
షమీ ఆకలితో ఉన్న చిరుతలా కనిపిస్తున్నాడు: సన్నీ

కోహ్లీకి షాక్:
కోహ్లీపై ఉన్న అభిమానంతో ఆయనను కలవాలని, ఫొటోలు దిగాలని అనుకుంటారు. అయితే కోహ్లీ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ అభిమాని ఏకంగా ఒంటిపై 16 ట్యాటూలు వేయించుకుని ఆచ్చర్యపరిచాడు. అతడే పింటు బెహరా. కటక్ వన్డే కోసం కోహ్లీ శనివారం బారాబతి మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లీని పింటు బెహరా కలిశాడు. అంతేకాదు చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లీకి చూపించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కోహ్లీ తన అభిమానితో మాట్లాడి ఫొటోలు దిగాడు.

అందుకే ట్యూటూలు వేయించుకున్నా:
ట్యాటూలపై పింటు బెహరా మాట్లాడుతూ...' కోహ్లీ అంటే పిచ్చి అభిమానం, ప్రేమ. అతడి డెడికేషన్, బ్యాటింగ్ చాలా ఇష్టం. కోహ్లీపై ఉన్న అభిమానాన్ని ప్రపంచానికి చెప్పాలన్నా. ఇందులో భాగంగానే ఒంటినిండా ట్యూటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యా. స్వదేశంలో కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్‌కు నేను వెళతాను. ఆర్థిక పరిస్థితి కారణంగా విదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లడం లేదు. అవకాశం వస్తే కోహ్లీ మద్దతుగా విదేశాలకు కూడా వెళతా' అని తెలిపాడు.

ఒంటిపై 16 ట్యాటూలు:
కోహ్లీపై తనకున్న ప్రేమను పింటు బెహరా చూపించాలనుకున్నాడు. 2016లో ఒంటిపై 16 ట్యాటూలు వేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ట్యాటూలకు కావాల్సిన డబ్బులు లేకపోవడంతో.. దొరికిన పనులు చేసి డబ్బులు సంపాదించి చివరకు తాను అనుకున్నది సాధించాడు. కోహ్లీ జెర్సీ నంబర్ 18, కోహ్లీ ఫొటో, బీసీసీఐ లోగో, ప్రపంచకప్ లాంటివి కూడా ట్యాటూలలో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications