అంధుల జట్టులో చోటు దక్కించుకున్న తొలి కాశ్మీరీ క్రికెటర్ ఇతడే

హైదరాబాద్: భారత అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికైన తొలి కాశ్మీరీ అంధ క్రికెటర్‌గా 21 ఏళ్ల ఇర్ఫాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. పుట్టిన కొద్ది వారాల్లోనే కంటిచూపు కోల్పోవడంతో ఇర్ఫాన్ అహ్మద్‌కు రెండు కళ్లు కనబడవు. ఆల్‌రౌండర్ అయిన ఇర్ఫాన్ అహ్మద్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం.
తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని అనేక సందర్భాల్లో వెల్లడించాడు. మూడేళ్ల వయసులోనే తొలిసారి క్రికెట్ బ్యాట్ పట్టుకున్న ఇర్ఫాన్ అహ్మద్ అంధుల క్రికెట్‌లో చక్కని ఆటతీరుతో అనేక పతకాలను గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తద్వారా భారత అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికైన తొలి కాశ్మీరీ క్రికెటర్‌గా నిలిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ టీ20 సిరిస్‌లో భారత తుది జట్టులోనూ చోటు దక్కించుకుంటానని ఇర్ఫాన్ ధీమా వ్యక్తం చేశాడు.

తొలి కాశ్మీరీ క్రికెటర్ ఇర్ఫాన్ అహ్మద్ చరిత్ర
భారత అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికైన తొలి కాశ్మీరీ క్రికెటర్ ఇర్ఫాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు.

పతకాలతో ఇర్ఫాన్ అహ్మద్
పుట్టిన కొద్ది వారాల్లోనే కంటిచూపు కోల్పోవడంతో ఇర్ఫాన్ అహ్మద్‌కు రెండు కళ్లు కనబడవు. క్రికెటర్‌గా తాను సాధించిన పతకాలు, మెడల్స్‌తో ఫోటోలకు ఫోజులిస్తోన్న ఇర్ఫాన్ అహ్మద్.

టీ20 సిరిస్‌లో ఇర్మాన్ అహ్మద్ చోటు
బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల భారత జట్టులో ఇర్మాన్ అహ్మద్ చోటు దక్కించుకున్నాడు.

కెప్టెన్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం
ఆల్‌రౌండర్ అయిన ఇర్ఫాన్ అహ్మద్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని అనేక సందర్భాల్లో వెల్లడించాడు. మూడేళ్ల వయసులోనే తొలిసారి క్రికెట్ బ్యాట్ పట్టుకున్న ఇర్ఫాన్ అహ్మద్ అంధుల క్రికెట్‌లో చక్కని ఆటతీరుతో అనేక పతకాలను గెలుచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications