న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌యే కాదు.. హాకీలోనూ అదరగొట్టిన మహిళా క్రికెటర్

Meet Elena Tice: Ireland’s 20-year-old Hockey World Cup silver medalist, who played international cricket at 13

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రీడల్లో మహిళలకు ఆదరణ పెరుగుతోంది. అలానే మహిళలు కూడా అవకాశాలు అందిపుచ్చుకుని తమ ప్రతిభను పెంపొందించుకునేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో.. మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ మహిళా క్రికెటర్‌ ఎలినా టైస్‌ అదరగొట్టింది. ఫైనల్లో నెదర్లాండ్‌ చేతిలో ఐర్లాండ్‌ ఓడినప్పటికీ ఆ మహిళా క్రికెటర్‌ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో రజతం సాధించి ఐర్లాండ్‌ చరిత్ర సృష్టించింది.

అయితే ఎలినా టైస్‌ క్రికెట్-పుట్‌బాల్, క్రికెట్-హాకీ, క్రికెట్-హాకీ, క్రికెట్-బాస్కెట్ బాల్ ఇలా రెండు క్రీడల్లో రాణించే మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికి ఆమె ప్రత్యేకం. లెగ్‌స్పిన్నర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన ఎలినా మాత్రం వీరందరికీ భిన్నంగా 13 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి మూడో పిన్నవయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. అనూహ్యంగా ఎలీనా డచ్‌పై తన అరంగేట్ర మ్యాచ్‌ ఆడింది. ఇక 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌ సీనియర్‌ హాకీ జట్టులో చోటు సంపాదించిన ఎలినా.. రెండేళ్లకే ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొని రజిత పతాక విజేతగా నిలిచింది.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సుజీ బేట్స్‌(బాస్కెట్‌ బాల్‌), ఆల్‌రౌండర్‌ సోఫీ డివిన్‌ (హాకీ)లు తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హాంప్‌షైర్‌లో జన్మించిన ఎలినా.. తన నాలుగేళ్ల వయసులోనే వారి కుటుంబం అమెరికాలోని ఇండియానాపొలిస్‌కు వలస వచ్చింది. అక్కడ తొలుత బేస్‌బాల్‌ క్రీడను ఎంచుకుంది. అయితే మరోసారి వారి కుటుంబం అక్కడి నుంచి వియన్నాకు తరలిరావడంతో ఆమె అడుగులు క్రికెట్‌వైపు పడ్డాయి.

ఇక ఆమె చిన్నతనంలో క్రికెట్‌, హాకీలు కాకుండా ఫుట్‌బాల్‌, రగ్భీలను ఆడేది. తన కుటుంబంలో చిన్నదైన ఎలినా.. సోదరులు సైతం క్రీడాకారులే కావడం విశేషం. ఒక సోదరుడు వికెట్‌ కీపర్‌ కాగా.. మరొకరు రగ్భీ ఆటగాడు. పిన్న వయసులో అదరగొట్టిన ఎలినా టైస్‌పై ఐర్లాండ్‌ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రజత పతకంతో తిరిగి వచ్చిన ఐర్లాండ్‌ జట్టుకు ఘనస్వాగతం పలికింది.

Story first published: Tuesday, August 7, 2018, 13:37 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X