కోల్‌కతా: ప్రస్తుతం టీమిండియాలో హార్ధిక్ పాండ్యా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఇటీవల ప్రపంచ టీ20 టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు అతడికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.
ఉత్కంఠగా జరిగిన ఆ మ్యాచ్ చివర్లో.. బంగ్లా గెలుపునకు మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన దశలో వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు తీసి భారత్‌కు విజయం అందించాడు. ఇంకేముంది పాండ్యా స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

అయితే ప్రస్తుతం ఈ క్రికెటర్.. కోల్‌కతాకు చెందిన ఓ మోడల్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జంషద్‌పూర్‌కు చెందిన లీషా శర్మ అనే మోడల్‌తో పాండ్యా.. కోల్‌కతా మాల్స్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడట. వీరిద్దరికీ సంవత్సరం క్రితం నుంచి పరిచయం ఉందట.
వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, వీరు దిగిన ఓ ఫొటోను సదరు మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అయితే వీరి మధ్య గాసిప్స్ గుప్పుమనడంతో ఆ మోడల్ పోస్టును తొలగించినట్లు సమాచారం.
అయితే దీనిపై ఇప్పటివరకూ అటు పాండ్యా గానీ.. ఇటు లీషా శర్మగానీ పెదవివిప్పలేదు. తమ ప్రేమాయాణంపై పాండ్యా మొదటగా స్పందిస్తాడా? లేక లీసానే బయటపెడ్తుందా? అనేది వేచి చూడాల్సిందే.