For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల బ్యాట్‌ల మరమ్మతులు చేసేది ఇక్కడే

Meet Aslam Chaudhry ‘Batman’ for IPL Cricket Stars

హైదరాబాద్: కేవలం బ్యాటింగ్ మీదే ధ్యాస పెట్టే పొట్టి లీగ్‌లలో ఐపీఎల్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనిక లీగ్ గా పేరొందిన ఐపీఎల్ అంటే ఉన్న క్రేజ్.. దాదాపు బ్యాట్స్ మెన్ లు తీసుకొచ్చిందే. మరి ఆ బ్యాట్స్‌మెన్‌ల బ్యాట్‌కి ఏమైనా అయితే.. మామూలువి అయితే మార్చేసుకోవచ్చు. కానీ, సెంటిమెంట్ గా ఫీలయ్యే బ్యాట్ అయితే. ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా రిపేర్ చేయించడానికే ప్రయత్నిస్తారు. మరి వాటిని రిపేర్ చేసేదెవరు..? సచిన్, కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ క్రికెటర్ల బ్యాట్‌లను బాగు చేసే బ్యాట్‌మన్ గురించి తెలుసుకుందాం.

అంతర్జాతీయంగా మంచి గుర్తింపు

అంతర్జాతీయంగా మంచి గుర్తింపు

ముంబైకి చెందిన అస్లాం చౌదరీ. అతన్ని ముద్దుగా అందరూ ఐపీఎల్‌ ‘బ్యాట్‌మన్‌'. అని పిలుస్తారు. ఎప్పుడో 1920లో తన తండ్రి ప్రారంభించిన బ్యాట్ల తయారీ వర్క్‌ షాప్‌ని అస్లాం నిర్వహిస్తున్నారు. షాప్‌ పాతదే అయినా.. తన కళా నైపుణ్యంతో నాణ్యమైన బ్యాట్లని తయారు చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చౌదరీ. ఎప్పడూ బ్యాట్ల తయారీలో తీరిక లేకుండా మునిగి పోయే 65 ఏళ్ల అస్లాం ఐపీఎల్‌ సీజన్‌ వస్తే ఇంకా బిజీ అయిపోతారు.

స్వయంగా విరాట్‌ కోహ్లి ఫోన్‌ చేశాడట:

స్వయంగా విరాట్‌ కోహ్లి ఫోన్‌ చేశాడట:

బాగా కలిసొచ్చిన బ్యాట్లను రిపేరు చేయడానికి స్టార్ క్రికెటర్లు సైతం ఆయనను ఆశ్రయిస్తారు. అస్లాం ఆదివారం ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యాట్ల తయారీ ప్రస్థానాన్ని వివరించారు. తండ్రి చూపిన దారిలో పయనిస్తూ తన నాణ్యమైన క్రికెట్‌ బ్యాట్ల తయారీ పరంపరను చెప్పుకొచ్చారు. ఎప్పుడూ క్రికెటర్ల మేనేజర్లు, సహాయక సిబ్బంది ఫోన్‌ చేసి ఆయా స్టార్ల బ్యాట్లకు మరమ్మతులు చేయాలని పిలుస్తుంటారు. అలాంటిది అనుకోకుండా ఓ రోజు అద్భుతం జరిగింది.

సచిన్‌, డుప్లెసిస్‌, స్టీవ్‌ స్మిత్‌, క్రిస్‌ గేల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లకు:

సచిన్‌, డుప్లెసిస్‌, స్టీవ్‌ స్మిత్‌, క్రిస్‌ గేల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లకు:

కానీ ఒకసారి స్వయంగా విరాట్‌ కోహ్లి ఫోన్‌ చేశాడని, తాను ఒక్క క్షణంపాటు.. మాట్లాడేది విరాట్‌ కాదేమోనని సందేహించానని అస్లాం తన ఆనందం వ్యక్తం చేశారు. సచిన్‌, డుప్లెసిస్‌, స్టీవ్‌ స్మిత్‌, క్రిస్‌ గేల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లకు బ్యాట్లు అందించానని ఈ బ్యాట్‌మన్‌ చెప్పుకొచ్చారు. అయితే ‘‘ఐపీఎల్‌ సీజన్‌లో బ్యాట్లకు మరమ్మతులు చేయడం కొంచెం ఇబ్బందే. ఎందుకంటే తమ సెంటిమెంట్‌ బ్యాట్‌ దెబ్బతిన్నప్పుడు ఏ ఆటగాడికైనా ఏం చేయాలో పాలుపోదు. వారు ఆడబోయే మరుసటి మ్యాచ్‌కి బ్యాట్‌ మరమ్మతులు పూర్తి కావాలి. దాంతో కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.' అని అస్లాం తెలిపారు.

లసిత్‌ మలింగ వచ్చి రెండు గంటలు ఇరుక్కుపోయాడని:

లసిత్‌ మలింగ వచ్చి రెండు గంటలు ఇరుక్కుపోయాడని:

తన వద్దకు మరమ్మతులకు వచ్చే బ్యాట్లకు ఎక్కువగా.. వాటి ఆకృతిని సరిచేయడం, బ్యాట్‌ అంచులు పెంచడం లేక తగ్గించడం చేస్తుంటానన్నారు. బ్యాట్ల రిపేర్‌ కోసం క్రికెటర్లు ఉండే చోటుకి వెళ్లి వాటిని తెస్తుంటానని, ఎందుకంటే, ఈ ఇరుకు వీధుల్లోకి ఆటగాళ్లు వస్తే మళ్లీ తిరిగి వెళ్లడం చాలా కష్టమని చెప్పారు. ఒకసారి శ్రీలంక బ్యాట్స్‌మన్‌ లసిత్‌ మలింగ అలా వచ్చి ఇరుక్కుపోయాడని, దాదాపు రెండు గంటలు మా షాప్‌లోనే నిరీక్షించి పోలీసుల సాయంతో బయటపడ్డాడని గుర్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటికీ చేతితో బ్యాట్లను తయారు చేసే అతి కొద్ది మందిలో అస్లాం ఒకరు.

Story first published: Monday, April 30, 2018, 18:22 [IST]
Other articles published on Apr 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+