
హైదరాబాద్: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆప్ఘనిస్థాన్‌కు చెందిన యువ క్రికెటర్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 21వ శతాబ్ధానికి చెందిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా ముజీబ్ అరుదైన ఘనత వహించాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘన్ యువ క్రికెటర్ ముజీబ్ జర్దాన్ తొలి వన్డేలో (4/24)తో అద్భుత ప్రదర్శన చేశాడు.
దీంతో ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లోనే ఎలాంటి తొందరపాటు లేకుండా అద్భుతమైన బంతులతో ఐర్లాండ్ జట్టుని ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో ముజీబ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన ముజీబ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భవిష్యత్తులో ఆప్ఘన్ జట్టులో మంచి బౌలర్‌గా ఎదుగుతాడని అటు కోచ్, ఇటు కెప్టెన్లు ప్రశంసల వర్షం కురిపించారు. మార్చి 28, 2001లో జన్మించిన ముజీబ్ 21వ శతాబ్ధంలో జన్మించి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు.
16 ఏళ్ల 252 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ముజీబ్.. అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో 9వ స్ధానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.
ఆప్ఘనిస్థాన్ జట్టులో రెహ్మత్ షా, నాజిర్ జమాల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం 239 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ను ముజీబ్ (4/24) దెబ్బతీయగా, మరో యువ ఆటగాడు రషీద్ ఖాన్ (3/28)తో మెరిశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.
ఈ సిరిస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు షార్జా వేదికగా జరగనున్నాయి. కౌలలాంపూర్ వేదికగా గత నెలలో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో కూడా ముజీబ్ అద్బుత ప్రదర్శన చేసి మీడియా దృష్టిని ఆకర్శించాడు. మొత్తం తాను ఆడిన 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో పాకిస్థాన్‌పై ఆప్ఘన్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.