Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

563: మెక్‌గ్రాత్ టెస్టు రికార్డుని బద్దలు కొట్టేది అతడే

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్రను వేసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ టెస్టు రికార్డుని ఓ యువ బౌలర్‌ బ్రేక్‌ చేసే అవకాశాలున్నాయట. మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వాహబ్‌ రియాజ్‌ వికెట్‌ తీసిన ఆస్ట్రేలియా బౌలర్‌ హాజిల్‌ఉడ్ 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

అయితే ఈ ఘనతను అతడు కేవలం 25 మ్యాచ్‌ల్లోనే సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి హాజిల్ ఉడ్‌పై పడింది. ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్‌కి ఇంటర్యూ ఇచ్చాడు. అందులో హాజిల్ ఉడ్ తన రికార్డుని అందుకోగలిగితే తనకు సంతోషమేనని అన్నాడు.

McGrath: Hazlewood could break my Test record

ఫోటోలు: మెల్‌బోర్న్ టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

ప్రస్తుతం అతడి వయసు 25 ఏళ్లు. నాకులాగే అతడు కూడా 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడగలిగితే ఆ మైలురాయిని అందుకునే అవకాశముందని చెప్పాడు. రికార్డులు అనేవి బద్దలు కొట్టేందుకే ఉన్నాయని, అయితే తన రికార్డుని చేధించడం అనేది అతని చేతుల్లోనే ఉందని చెప్పాడు.

ఎందుకంటే మ్యాచ్‌ మ్యాచ్‌కి తప్పిదాలను దిద్దుకుంటూ పూర్తి ఫిట్‌నెస్‌తో మెరుగైన ప్రదర్శన చేయడం అంత సులువుకాదని మెక్‌గ్రాత్ వివరించాడు. ఇదిలా ఉంటే తన కెరీర్‌లో 124 టెస్టు మ్యాచ్ లాడిన మెక్‌గ్రాత్ 563 వికెట్లు తీసుకుని ఆల్‌టైం వికెట్ టేకర్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అందులో ఐదు వికెట్లను 29 సార్లు, పది వికెట్లను మూడుసార్లు తీసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+