ఓవల్: న్యూజిలాండ్ సారథి బ్రెండన్ మెకల్లమ్ రికార్డు సృష్టించాడు. ఓవల్ వేదికగా శ్రీలంక న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో అతను సిక్స్ కొట్టడం ద్వారా ఓ రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో వంద 'సిక్స్'లు కొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు వంద సిక్స్‌లు కొట్టిన రికార్డ్ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ పైన ఉంది. దీనిని ఆదివారం నాడు మెకల్లమ్ సమం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్సులో రెండు, రెండో ఇన్నింగ్సులో ఒక సిక్స్ కొట్టాడు.

వీటితో టెస్ట్ కెరీర్లో మొత్తం 100 సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. మెకల్లమ్ 98 టెస్టులు ఆడి 11 సెంచరీలు చేశాడు. అందులో 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
టెస్టుల్లో అతని పరుగులు 6,237. టెస్టు ఫార్మాట్లో మెకల్లమ్ హయ్యెస్ట్ స్కోర్ 302. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వారు వారిలో... గిల్ క్రిస్ట్ 100, మెకల్లమ్ 100, క్రిస్ గేల్ 98, కలిస్ 97, వీరేంద్ర సెహ్వాగ్ 91తో ఉన్నారు.