
ఈ టీ20 వరల్డ్ కప్ లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో పసికూన దేశాలు వెస్టిండీస్, శ్రీలంక లాంటి దేశాలను ఓడగొట్టాయి. ముఖ్యంగా ఐర్లాండ్, నెదర్లాండ్స్ చక్కని ప్రదర్శనతో సూపర్-12 వచ్చాయి. ఐర్లాండ్ ఓ మ్యాచ్ ఇంగ్లాడ్ కూడా మట్టికరిపించింది. ప్రస్తుతం ఈ జట్టు గ్రూప్-1లో మూడో స్థానంలో ఉంది. ఐర్లాండ్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లో కూడా ఆకట్టుకుంటున్నారు.
మెక్‌కార్తీ
తాజా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ ఆటగాడు అద్భుత ఫీల్డింగ్ చేశాడు. మెక్‌కార్తీ అద్భుతమైన డైవ్ తో సిక్సర్ ను ఆపి రెండు పరుగులే వచ్చాలే చేశాడు. 14 ఓవర్ రెండో బంతిని అదిర్ వేయగా.. స్టోయినిస్ దాన్ని సిక్స్ కొట్టాలని పైకి లేపాడు. బంతి గాల్లో లేచింది. పరుగెత్తుకుంటూ వచ్చిన మెక్‌కార్తీ క్యాచ్ పట్టాడు. కానీ బౌండరీలో పడిపోతున్నానని తెలిసి బంతిని బయటకు వేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు రెండు పరుగులే వచ్చాయి.
ఫించ్
మెక్‌కార్తీ కామెంటెటర్లు ఆశ్చర్యపోయారు. అద్భుత ఫీల్డింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా సూపర్ ఫీల్డింగ్ చేశారు. బౌండరీలో అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కాగా ఆ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఆసీస్ ఆదిలోనే డెవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ అరోన్ ఫించ్ మాత్రం దాటిగా ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కూడా మ్యాక్స్ వెల్ నిరాశ పరిచాడు.