
మన్కడింగ్‌పై నిషేధం
క్రికెట్‌లో పలు మార్లు అనేక వివాదాలకు దారి తీసిన మన్కడింగ్‌పై ఎంసీసీ నిషేధం విధించింది. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్.. బంతి వేయడానికి ముందే క్రీజు దాటితే సదరు బౌలర్ అతన్ని ఔట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. తాజాగా ఈ విధానాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది.
బౌలింగ్ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బ్యాటర్ పరుగు కోసం సిద్దంగా ఉండాలి కాబట్టి అందులో భాగంగానే క్రీజు దాటే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో మన్కడింగ్ పేరుతో బౌలర్ సదరు బ్యాటర్‌ను ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమని అభిప్రాయపడింది. అందుకే ఇకపై బౌలర్ మన్కడింగ్ చేసే అవకాశం లేకుండా క్రికెట్ నిబంధనల్లో భాగంగా లా-41(క్రీడాస్పూర్తికి విరుద్ధం), లా-38(రనౌట్) ప్రకారం ఈ రూల్‌ను తొలగిస్తున్నట్లు ఎంసీసీ వెల్లడించింది.

స్ట్రైక్‌లో కొత్త బ్యాటర్
బ్యాటర్ క్యాచ్ ఔట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైక్ విషయంలోనూ ఎంసీసీ మార్పు చేసింది. బ్యాటర్ క్యాచ్ ఇచ్చినప్పుడు ఆ క్యాచ్‌ను ఫీల్డర్ అందుకునే లోపే బ్యాటర్లు ఇద్దరు పరుగుకు పరిగిత్తే క్రమంలో ఒకరినొకరు దాటితే, క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు ఉండాలని రూల్ తీసుకొచ్చింది. గతంలో ఉన్న రూల్ ప్రకారం ఇలాంటి సమయాల్లో క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు వైపున ఉండేవాడు.

బంతిపై లాలా జలం పూయకూడదు
ఇంతకుముందు బౌలర్లు బంతి స్వింగ్ అయ్యేందుకు సహకరించడం కోసం దానిపై లాలాజలం పూసేవారు. కానీ కరోనా సమయంలో బౌలర్లు బంతిపై లాలా జలాన్ని పూయడాన్ని ఎంసీసీ నిషేధించింది. తాజాగా దీనిని ఎంసీసీ పూర్తిగా నిషేధించింది. బంతిపై లాలాజలం పూయడం వల్ల, బంతి ఉత్పత్తి చేసే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుందని, అందుకే ఇకపై బౌలర్లు అలా చేయకూడదని పేర్కొంది. దీనిపై ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నిషేధం విధించారు.

ఇకపై అది వైడ్
క్రికెట్‌లోని లా 22.1 ప్రకారం ఇకపై బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్ స్థానం నుంచి బౌలర్ వేసే బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్‌గా పరిగణించనున్నట్లు ఎంసీసీ వెల్లడించింది. డెడ్‌బాల్స్, కట్‌స్ట్రిప్ దాటిన బంతిని బ్యాటర్ టచ్ చేసే విషయంలోనూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ కొత్త రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications












