Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాంఖడే నుంచి మ్యాచ్‌ను మార్చొద్దని పిటిషన్ దాఖలు

 MCA moves Bombay High Court against shifting ODI from Wankhede

ముంబై: భారత్‌, వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ సవ్యంగా సాగేలా కనిపించడం లేదు. కానీ, వన్డేలు ఆడేందుకు మాత్రం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. రెండో వన్డేకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మ్యాచ్‌కు కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో వివాదం తలెత్తడంతో దానికి విశాఖకు తరలించారు. ముంబై క్రికెట్‌ సంఘంలో పరిస్థితులు బాగాలేకపోవడంతో మ్యాచ్‌ను వాంఖడే నుంచి బ్రబౌర్న్‌ మైదానంలో నిర్వహించనున్నారు.

బీసీసీఐ ఎలా నిర్వహిస్తుందంటూ పిటిషన్‌

బీసీసీఐ ఎలా నిర్వహిస్తుందంటూ పిటిషన్‌

బ్రబౌర్న్‌ మైదానంలో ఈనెల 29న నిర్వహించే మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ), ఇద్దరు సభ్యులు సంజయ్‌ నాయక్‌, రవి సావంత్‌ తాజాగా బాంబే హైకోర్టును సంప్రదించారు. వాంఖడేలో కాదని బ్రబౌర్న్‌లో బీసీసీఐ మ్యాచ్‌ ఎలా నిర్వహిస్తుందంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిచ్ స్వభావం ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ప్రతికూలంగా ఉందని పేర్కొంది.

సంతకం అడగడంలో బీసీసీఐ తప్పేమీ లేదని

సంతకం అడగడంలో బీసీసీఐ తప్పేమీ లేదని

కాగా టికెట్ల అమ్మకాలపై మధ్యంతర స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ఎంసీఏ తరఫున ఎంఎం జోషీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత మ్యాచ్‌ ఆతిథ్య ఒప్పంద పత్రంపై పాలకుడి సంతకం అడగడంలో బీసీసీఐ తప్పేమీ లేదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఎంఎస్‌ కార్నిక్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎంసీఏకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సైతం లేరని వెల్లడించింది.

స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టుకు వెళ్లమని

స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టుకు వెళ్లమని

విమర్శలు చేయడంతో కోర్టు నియమించిన పాలకులు పదవిలో కొనసాగేందుకు ఇష్టపడలేదని తెలిపింది. తాము మధ్యంతర స్టే ఇవ్వలేమని కావాలంటే సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని పేర్కొంది. బీసీసీఐ, క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత పిటిషన్లకు సంబంధించి ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఎంసీఏ తరపున వాదిస్తోన్న జోషీ

ఎంసీఏ తరపున వాదిస్తోన్న జోషీ

‘మేం వాంఖడే మైదానంలో మ్యాచ్‌ నిర్వహించాల్సి ఉంది. టికెట్ల విక్రయం, ప్రచార హక్కులకు సంబంధించిన అన్ని పరిస్థితులు తెలియజేశాం. ఆతిథ్య ఒప్పంద పత్రం మాత్రమే బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది. దానిపై క్రికెట్‌ పాలకులు సంతకం చేయాల్సి ఉండటంతో సమర్పించలేకపోయాం. ప్రస్తుతం ఎంసీఏకు పాలకుడు లేడు. ఈ కారణంతోనే మ్యాచ్‌ను బ్రబౌర్న్‌కు మార్చారు. ఆ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహణకు అనువుగా లేదు. 2009లో అక్కడ చివరిసారి మ్యాచ్‌ జరిగింది' అని జోషి వాదించారు.

Story first published: Thursday, October 18, 2018, 12:17 [IST]
Other articles published on Oct 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+