Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మయంతి లంగర్‌ vs రోహా నదీమ్‌ : దాయాదుల పోరు క్రికెట్‌లోనే కాదు..అందంలో కూడా

సాధారణంగా అభిమానులు క్రికెట్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్‌కు వెళ్తుంటారు . కాని ఇటీవల కాలంలో క్రికెట్ గురించి వివరించే యాంకర్స్‌ను కోసం కూడా అభిమానులు గ్రౌండ్‌కు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు మహిళ వ్యాఖ్యాతలు తమ అందంతో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నారు. వారిలో ఒకరు మన దేశానికి చెందిన మయంతి లంగర్‌ కగా, మరొకరు పాకిస్థాన్‌కు చెందిన రోహా నదీమ్‌. వీరిద్దరూ కూడా క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ గురించి కాకుండా వారి అందం గురించి చర్చించుకోవడం విశేషం.

మయంతి లంగర్‌...ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ అభిమాని ఉండరు. మన దేశంలో క్రికెట్ ఎంత ఫేమస్ అయిందో... మయంతి లంగర్‌ కూడా అంతే ఫేమస్ అయింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో సమయంలో గ్రౌండ్‌లో తెగ సందడి చేస్తుంటుంది ఈ హాట్ యాంకర్ . తన అందచందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంటుంది. మయంతి కోసమే క్రికెట్ చూసేవాళ్లు కూడా ఉన్నారు. ఇండియన్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని మయంతి లంగర్‌ ప్రేమ వివాహం చేసుకుంది. గర్భవతి కావడంతో రెండు సీజన్స్‌లో ఆమె కనిపించలేదు.దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. కాని 2023 సీజన్‌లో మయంతి లంగర్‌ తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టి అభిమానులను అలరించింది.

mayanti langer vs roha nadeem

తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ యాంకర్ ఒక్కసారిగా లైఫ్ లైన్‌లోకి వచ్చేసింది. ఆసియా కప్‌‌లో భాగంగా నేపాల్- పాకిస్థాన్ జట్లు మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ సమయంలోనే తళుక్కున మెరిసింది యాంకర్ రోహా నదీమ్‌. పాకిస్థాన్‌కు చెందిన రోహా నదీమ్‌ నుంచి అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. గ్రౌండ్‌కు వచ్చిన వారితో పాటు,టీవీల్లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారి చూపంతా కూడా యాంకర్ రోహా నదీమ్‌ మీదనే ఉంది. ఈ యాంకర్‌ను చూసిన అభిమానులు తమ కళ్లను ఆమె నుంచి తిప్పుకోలేకపోయారు. చూపు తిప్పుకోలేని అందంతో మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను కట్టిపడేసిందామె.

mayanti langer vs roha nadeem

రోహా నదీమ్‌ అందాన్ని వర్ణిస్తూ కవితలు కూడా అల్లేస్తున్నారు. ఎవరీ మిస్టరీ గర్ల్ అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఈ ఇద్దరి భామల గురించి సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద యుద్దమే సాగిస్తున్నారు. అందంలో రోహా నదీమ్‌ మయంతి లంగర్‌‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఉందని నెటిజన్లు కొందరు కామెంట్ చేస్తుండగా.. మయంతి అందం ముందు రోహా నదీమ్‌ పనికి రాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు దాయాదుల పోరు క్రికెట్‌లోనే కాదు..అందంలో కూడా అని నిరుపిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ క్రికెట్ గురించి కాకుండా..క్రికెట్ వ్యాఖ్యాతల గురించి చర్చించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Story first published: Friday, September 1, 2023, 15:38 [IST]
Other articles published on Sep 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+