బిన్నీ అదృష్టవంతుడు: మయాంతి లాంగర్ శరీరంపై నెటిజన్ల ట్రోల్స్!

హైదరాబాద్: మయాంతి లాంగర్... స్పోర్ట్స్ గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్యగా కంటే కూడా స్పోర్ట్స్ యాంకర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. క్రికెట్‌కు సంబంధించి ప్రీ-మ్యాచ్, పోస్ట్-మ్యాచ్ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు.
ఆమె యాంకరింగ్‌లో ఓ స్టైల్, గ్రేస్ ఉంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది.
యాంకర్‌గా మయాంతి లాంగర్
ఈ సిరిస్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో మయాంతి లాంగర్ యాంకర్‌గా వ్యవహారిస్తున్నారు. ధర్మశాల వేదకగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో మొహాలీ వేదికగా రెండో టీ20 బుధవారం జరిగింది. మ్యాచ్ అనంతరం రెండో టీ20 హైలెట్స్ గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రెండో టీ20 హైలెట్స్‌పై
రెండో టీ20 హైలెట్స్ గురించి ఆమె స్టార్ట్ స్పోర్ట్స్‌లో లైవ్ టెలికాస్ట్ ఇస్తోన్న సమయంలో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ వచ్చాయి. ముఖ్యంగా మయాంతి లాంగర్ శరీర ఆకృతిపై నెటిజన్లు ట్రోల్ చేయడం విశేషం. ఓ నెటిజన్ "స్టువర్ట్ బిన్నీ సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే అందమైన మయాంతి లాంగర్‌ను భార్యగా పొందడమే" అని కామెంట్ చేశాడు.
మీ రేటింగ్స్‌ను గనుక పెంచుకోవాలంటే
మరొక నెటిజన్ అయితే "మీ రేటింగ్స్‌ను గనుక పెంచుకోవాలంటే క్రికెట్‌కు కొంచెం స్పైస్ జత చేయాలి. ఇందుకోసం మయాంతిని తీసుకురండి. ఆమె చాలా సెక్సీగా, అందంగా ఉంటుంది. మీ ప్రస్తుత ఫీమేల్ యాంకర్లలో ఒక్కరు కూడా ఆమెలా ఉండరు" అని కామెంట్ పోస్టు చేశాడు. మరికొందరైతే మయాంతి లాంగర్ పాత ఫోటోలను సైతం పోస్టు చేస్తున్నారు.
గతంలో ఓ అభిమాని ఇలా
ఇదిలా ఉంటే, గత ఐపీఎల్ సీజన్‌లో ఓ తుంటరి అభిమాని ఆమెను డిన్నర్ డేట్‌కు రమ్మని పిలిచాడు. ఆ అభిమాని కోరికను ఆమె కాదనలేదు. అంతేకాదు, ఆ అభిమానికి ఆమె ఇచ్చిన సమాధానం ఆమెపై ప్రశంసలు కురిసేలా చేసింది. తన ట్విట్టర్‌లో 'నేను మిమ్మల్ని చూసినప్పుడు.. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడం మానేశా. మీరొక అద్భుతమైన పర్సనాలిటీ. మిమ్మల్ని నేను డిన్నర్‌కు తీసుకెళ్తామని అనుకుంటున్నా. మీరు ఎంత అందంగా ఉన్నారో వర్ణించడానికి నా దగ్గర మాట్లలేవ్' అని ట్వీట్ చేశాడు. మయాంతి తన ట్విట్టర్‌లో 'థ్యాంక్ యూ! నా భర్తతో పాటు నేను ఇద్దరం కలిసి డిన్నర్ డేట్‌కు వస్తాం' అని ట్వీట్ ద్వారా బదులిచ్చింది.
Milky legs @MayantiLanger_B #MayantiLanger pic.twitter.com/1ihqXpvPr4
— Hotness (@hottieactress) 28 March 2019
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications